మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2014 (16:06 IST)

ఫేసు‌బుక్ అధిపతి విరాళం.. ఎబోలాపై పోరుకు రూ.150 కోట్లు

ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జుకెర్‌బెర్గ్ తన ధాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. అమెరికా, బ్రిటన్‌లతో పాటు.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్‌ నిర్మూలనకు రూ.150 కోట్ల నిధులను విరాళంగా ప్రకటించారు. తన భార్య ప్రిసిల్లాతో కలిసి దాదాపు 150 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్ఓల్ అండ్ ప్రివెన్షన్ సంస్థకు ఈ మొత్తం పంపారు.
 
వీలైనంత తక్కువ కాలంలోనే ఈ వ్యాధిని అదుపు చేయాలని, లేకపోతే అది మరింతగా వ్యాప్తి చెంది.. దీర్ఘకాలంలో ఆరోగ్య సంక్షోభంగా మారుతుందని, చివరకు హెచ్ఐవీ, పోలియోలలాగే ఎబోలా మీద కూడా కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వస్తుందని తన ఫేస్బుక్ పోస్టులో తెలిపాడు. 
 
కాగా, ఈ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు నాలుగువేల మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. వీరిలో ఎక్కువ మంది పశ్చిమాఫ్రికాకు చెందిన పౌరులే ఉన్నారు. ఇప్పటికీ మరో 8,400 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు జుకెర్బెర్గ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.