గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (18:03 IST)

144 కోట్లకు చేరిన వీక్షకులు... ''ఫేస్‌ బుక్'' సరికొత్త రికార్డు..!

ప్రపంచంలో అత్యాంత ప్రసిద్ధి చెందిన సామాజిక మాధ్యమం ''ఫేస్ బుక్'' సరికొత్త రికార్డును సృష్టించింది. ఫేస్ బుక్‌ను వీక్షకుల సంఖ్య 144 కోట్లకు చేరింది. ముఖ్యంగా యువత భోజనం చేస్తుందో లేదో కానీ, ఫేస్‌ బుక్‌ లోకి రాకుండా ఉండడం లేదు.
 
ప్రస్తుత ఫేస్ బుక్ సంస్థ త్రైమాసి లాభం 20 శాతం పెరిగింది. ముఖ్యంగా మొబైల్ యాడ్స్ ద్వారా ఈ మొత్తం ఆదాయం అందింది. ఈ సంస్థకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 3.32 బిల్లియన్ డాలర్లు కాగా, ఇది గతంతో పోల్చితే 13 శాతం అధికం. ప్రపంచ వ్యాప్తంగా 144 కోట్ల మంది ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు. మొబైల్ ద్వారా 125 కోట్ల మంది ఫేస్‌ బుక్‌ సైట్‌లోకి వస్తున్నారు. 
 
ఈ విషయమై ఫేస్ బుక్ నిర్వాహక అధికారి మార్క్ సుక్సర్ పోర్క్ మాట్లాడుతూ. ఈ ఏడాది తాము మంచి లాభాలను చేజిక్కించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇంకా ప్రపంచం నలు మూలల ఉన్న ప్రజానికాన్ని ఏకంచేయడం కోసం తాము మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.