మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 1 జూన్ 2017 (10:38 IST)

వయసు మీద పడుతోందని అనిపిస్తే చాలు.. మీలో అది డమాల్ అట...

ముసలివాళ్లమయిపోతున్నాం అనే ఫీలింగ్ కలిగిందంటే చాలు మీ సెక్స్ లైఫ్‌ను సంతృప్తిగా గడపలేరని తాజా అధ్యయనం చెబుతోంది. తమ వయస్సు పెరిగిపోతోందన్న భావనకు ఎంత దగ్గరగా మనుషులు వస్తే అంత త్వరగా వారి లైంగిక జీవిత

ముసలివాళ్లమయిపోతున్నాం అనే ఫీలింగ్ కలిగిందంటే చాలు మీ సెక్స్ లైఫ్‌ను సంతృప్తిగా గడపలేరని తాజా అధ్యయనం చెబుతోంది. తమ వయస్సు పెరిగిపోతోందన్న భావనకు ఎంత దగ్గరగా మనుషులు వస్తే అంత త్వరగా వారి లైంగిక జీవితంలో నాణ్యత లోపిస్తుందని కెనడాలోని ఒంటారియాలో ఉన్న వాటర్లూ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ స్టీవెన్ మాక్ చెబుతున్నారు. 
 
అదే సమయంలో తాము ఇప్పటికీ కుర్రాళ్లమే అనే ఫీలింగ్ మనసులో ఉంటే అలాంటి వారి సెక్స్ జీవితంపై అది భారీ ప్రభావం చూపుతుందని, వారు అత్యంత ఆసక్తితో సెక్స్‌లో పాల్గొంటారని స్టీవెన్ మాక్ చెప్పారు.
 
ఈ పరిశోధన కోసం మాక్ నేతృత్వంలోని బృందం సెక్స్, వృద్ధాప్యంకి సంబంధించి 1,170 మంది పెద్దలను తీసుకుంది. 40 ఏళ్ల నుంచి 70 ఏళ్లవయసులోని వారిని ఈ పరిశోధనకు తీసుకున్నారు. ఈ పరిశోధనలో తేలిన దాని ప్రకారం తాము ముసలివాళ్లమయిపోయామన్న ఫీలింగ్ వచ్చిందంటే అలాంటివారు సెక్స్‌లో పాల్గొనడం, లైంగిక కార్యంలో నాణ్యతను కలిగి ఉండటం, సెక్సువల్ సంబంధంలో ఆసక్తి అనేవి బాగా తగ్గిపోతున్నట్లు తేలింది. 
 
తాము యువకులం అనే ఫీలింగ్ ఉంటే అది వారి లైంగిక సామర్థ్యాన్ని ఏమేరకు ప్రదర్సిస్తుందో అంచనా లేదు కానీ ముసలివాళ్లమయిపోతున్నాం అనే ఫీలింగ్ వచ్చిందంటే సెక్స్ పట్ల వారి ఆసక్తి బాగా తగ్గిపోతోందని పరిశోధన బృందం కనుగొంది