శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 నవంబరు 2016 (15:35 IST)

క్యూబా విప్లనేత ఫిడెల్ క్యాస్ట్రో మృతి.. #FidelCastro మరుపురాని వ్యాఖ్యలు.. ఫిడెల్ ప్రస్థానం..

క్యూబా విప్లవనేత, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో క్యాస్ట్రో అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నారు. క్యాస్ట్రో మృతిపట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు సంతాపం వ్య

క్యూబా విప్లవనేత, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో క్యాస్ట్రో అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నారు. క్యాస్ట్రో మృతిపట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడిన క్యాస్ట్రో మృతిపట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 
 
ఇకపోతే.. సాయుధపోరాటంలో ఎత్తుగడలకు ప్రాధాన్యం ఎక్కువ. క్యూబా విప్లవ పోరాటంలో ఫెడల్‌ క్యాస్ట్రో ఆలోచన అయితే అతని అమ్ములపొదిలోని ప్రధాన ఆయుధం చేగువేరా. ఎక్కడో పుట్టి, పరాయి దేశంలో సమసమాజ స్థాపన కోసం తుపాకి పట్టిన చేగువేరాకు, అతని పరాక్రమానికి ఎల్లవేళలా ప్రోత్సాహం ఇస్తూ విప్లవాన్ని విజయంవంతం చేయడంలో ఫెడెల్‌ క్యాస్ట్రో అనుసరించిన తీరు అద్భుతం. 
 
1950 దశకం నుండి క్యూబాలో అమెరికా అనుకూల బటిస్టా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు ఆరంభం కాగా, చెరుకు రైతులతోపాటు సాధారణ ప్రజల జీవితాలనూ పీల్చి పిప్పిచేస్తూ నాటి ప్రభుత్వంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆవేశాన్ని విప్లవానికి అనుకూలంగా మలచడంలో ఫెడల్‌కు చేగువేరా అందించిన అద్భుతమైన సహకారం అందించారు. ఇలా 1956లో ఫిడెల్ 80 మంది అనుచరులను 'గ్రాన్మా' నౌకలో తీసుకొనిపోయి బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక విఫల ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే తర్వాతి రెండేళ్ళ కాలంలో విప్లవంగా మారిపోయింది.
 
వైద్యుడిగా ఫెడల్‌ విప్లవ సైన్యంలో చేరిన చేగువేరా.. మాక్సిజం, లెనినిజంల పంథాను సహచరులకు మరింత అర్థమయ్యేలా వివరించేవాడు. ఇంకా యుద్ధక్షేత్రంలో ఏమాత్రం బెరుకులేకుండా దూసుకెళ్లే చేగువేరాకు ఫెడల్ సరైన సహకారం అందించారు. 
 
చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా మోటర్‌ బైక్‌పై వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో రావుల్ క్యాస్ట్రో, ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ 'జూలై 26 విప్లవం'లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. 
 
విప్లవం అనంతరం ఒక దేశంగా క్యూబా మనుగడ సాధించాలంటే ప్రపంచంలోని మిగతా దేశాలతో(ఒక్క అమెరికాతో తప్ప) సఖ్యత అత్యవసరమైంది. ఆ బాధ్యతను కూడా ఫెడల్‌ క్యాస్ట్రో.. చేగువేరాకే అప్పగించాడు. ఇలా క్యూబా విదేశాంగ మంత్రి హోదాలో భారత్‌ సహా రష్యా, శ్రీలంక, జపాన్‌, చైనా తదితర దేశాల్లో పర్యటించి, కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుని క్యాస్ట్రో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇలా విప్లవానికి ఊపిరిపోసిన చేగువేరా బొలీవియాలో ప్రభుత్వ సేనలతో పోరాడుతూ 1967 అక్టోబర్ 9న మృతిచెందాడు. 
 
ఫిడెల్ క్యాస్ట్రో, కమ్యూనిజం గురించి వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు.. మరిచిపోలేని.. 
* 82మందితో నేను విప్లవాన్ని ప్రారంభించాను. మరోసారి విప్లవాన్ని చేయాలనుకుంటే కేవలం 10, 15మందితో, సంపూర్ణ విశ్వాసంతో చేస్తాను.
 
* క్యూబన్‌ ప్రజారోగ్యం కోసం నేను చేయాలనుకున్న చివరి త్యాగం.. పొగ తాగటాన్ని మానెయ్యడం. కానీ దానిని నేను చేయలేకపోయాను. 
- 1985 డిసెంబర్‌లో తాను పొగతాగడం మానేశానని ప్రకటించిన సందర్భంగా ఫిడెల్ వ్యాఖ్యలు
 
* నాలోని భావజాలాలకు, ఆ అసాధారణ వ్యక్తి (జీసెస్‌ క్రైస్ట్‌)లోని భావజాలాలకు ఎలాంటి వైరుధ్యాన్ని నేను చూడలేదు 
- 1985లో క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు
 
విప్లవం అందించిన గొప్ప ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే మా వేశ్యలు కూడా పట్టభద్రులే 
- డైరెక్టర్‌ ఆలివర్‌ స్టోన్‌ 2003లో తీసిన డాక్యుమెంటరీ 'కమాండెంట్‌'పై క్యాస్ట్రో
 
అమెరికాతో చేయబోయే యుద్ధమే నా నిజమైన గమ్యమని నేను గుర్తించాను 
- 2004లో ఒలివర్‌ స్టోన్‌ తీసిన రెండో డాక్యూమెంటరీ 'లుకింగ్‌ ఫర్‌ ఫిడెల్‌' లో క్యాస్ట్రో ప్రారంభ మాటలు