శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 21 ఫిబ్రవరి 2015 (15:45 IST)

దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం... 59, 60 అంతస్థులు పూర్తిగా దగ్ధం...!

దుబాయ్‌లో ఉన్న 80 అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్‌లో టార్చ్ టవర్ అనే ఒక భారీ భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. ఈ భారీ భవనంలోని 59వ అంతస్తులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వేలాదిమంది వున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై అందరినీ ఆ భవనంలోంచి సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. 
 
ఈ ప్రమాదంలో 59వ అంతస్తులో చెలరేగిన మంటలు 60వ అంతస్తుకు కూడా ఎగబాగాయి. దీంతో రెండు ఫ్లోర్‌లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం సంభవిచడంతో భవనంలో ఉన్న వందలాది మంది ఒక్క సారిగా కిందకు దిగి వచ్చేందుతు యత్నించడంతో మెట్లపై తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో పలువురు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు. అయితే ఆస్తినష్టం భారీగా జరిగినట్టు తెలుస్తోంది. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.