శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (10:13 IST)

అగ్నికి ఆహుతైన లండన్‌ గ్రెన్ ఫెల్ టవర్‌: ఒకటే దారి.. వందలాది మంది సజీవదహనం..

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది మంది సజీవదహనమై వుంటారని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లండన్, వెస్ట్‌ ఎస్టేట్‌ లోని 27 అంతస్తుల గ్రెన్‌ ఫెల్‌ టవర్‌ మొత్తం అ

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది మంది సజీవదహనమై వుంటారని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లండన్, వెస్ట్‌ ఎస్టేట్‌ లోని 27 అంతస్తుల గ్రెన్‌ ఫెల్‌ టవర్‌ మొత్తం అగ్నికి ఆహుతికాగా, ఈ భవంతి ఎప్పుడైనా కూలిపోవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎగసి పడుతున్న మంటలు అదుపులోకి రాకపోగా, పక్కనున్న భవనాలకు కూడా వ్యాపించాయి.
 
మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 1974లో నిర్మించిన టవర్‌లోని 120 ఫ్లాట్‌ లన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో అత్యధికులు నిద్రిస్తుండటంతో, మృతుల సంఖ్య వందల్లోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తమ కళ్ల ముందే ఎంతో మంది కాలి బూడిదై పోయారని, ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
 
ఇప్పటికీ కొన్ని ఫ్లాట్ల నుంచి సహాయం కోసం ప్రజల హాహాకారాలు వినిపిస్తున్నాయి. వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడేందుకు పోరాడుతున్నారు. ఈ భవనానికి రాకపోకలు ఒకటే మార్గం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు.