Widgets Magazine

వణికిస్తున్న ఫ్లోరెన్స్... అమెరికాను ముంచెత్తనున్న వరదలు

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:09 IST)

అమెరికాను ఫ్లోరెన్స్ వణికిస్తోంది. ఫలితంగా అమెరికా మరోమారు వరదల్లో చిక్కుకోనుంది. ఫ్లోరెన్స్ హరికేన్ ఫలితంగా తూర్పు తీరప్రాంతంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయని, కొండచరియలు విరిగి పడతాయని అమెరికా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని పేర్కొంది.
Florence Hurricane
 
ఈ ఫ్లోరెన్స్ హరికేన్ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడి తూర్పు తీరం వైపు నెమ్మదిగా కదులుతోంది. ఈ హరికేన్ కేటగిరీ-1 కిందకు చేర్చారు. దీనిఫలితంగా తీవ్రముప్పు పొంచివున్నట్టు భావిస్తున్నారు. ఇదిక్రమంగా బలం పుంజుకుని, రాగల 24 గంటల్లో కేటగిరీ-4 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని అమెరికాలోని జాతీయ హరికేన్‌ కేంద్రం (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. 
 
ఈ కారణంగా తూర్పు తీరప్రాంతంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయని, కొండచరియలు విరిగి పడతాయని హెచ్చరించింది. ప్రస్తుతం బెర్ముడాకు 1100 కిలోమీటర్లు ఆగ్నేయంగా హరికేన్‌ కేంద్రీకృతమై ఉందని, గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి ఉత్తర, దక్షిణ కరోలినా మధ్య ఇది తీరం దాటవచ్చునని తెలిపింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగ్గారెడ్డి అరెస్ట్... గుజరాత్‌లోని వ్యక్తులు మీ భార్య కుటుంబ సభ్యులెలా? పోలీస్ ప్రశ్న

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. 2004లో నకిలీ ...

news

నా స్నేహితులతో పడక పంచుకుంటావా? లేదా? యువతికి బెదిరింపులు

ముంబైలో ఓ యువతిని బెదిరించి కొందరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అదీకూడా తన ...

news

వివాహితుడితో కుమార్తె ప్రేమ... పరాయి స్త్రీతో భర్త అక్రమ సంబంధం... ఇద్దరూ కలిసి...

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలంలో దారుణం జరిగింది. భర్త, కుమార్తె కలిసి ...

news

ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ... నుదుటిపై గన్ పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కింది..

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి తన స్నేహితుడితో వాట్సాప్ చాట్ చేస్తూ లోడింగ్ ...

Widgets Magazine