గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (17:58 IST)

డేటింగ్ పేరుతో పరిచయం.. రెస్టారెంట్లో ఎంజాయ్.. యువకుడి హతం.. ఎలా?

డేటింగ్ పేరుతో లొంగదీసుకుంది. మరుసటి రోజు వస్తానని ఊరించింది. కాలింగ్ బెల్ కూడా కొట్టింది. కానీ డేటింగ్ పేరుతో మోసం చేసింది. డేటింగ్ అంటూ ఓ యువకుడిని 18ఏళ్ల నిలువునా దోచుకుంది. అంతటితో వదలకుండా తన వెం

డేటింగ్ పేరుతో లొంగదీసుకుంది. మరుసటి రోజు వస్తానని ఊరించింది. కాలింగ్ బెల్ కూడా కొట్టింది. కానీ డేటింగ్ పేరుతో మోసం చేసింది. డేటింగ్ అంటూ ఓ యువకుడిని 18ఏళ్ల నిలువునా దోచుకుంది. అంతటితో వదలకుండా తన వెంట ఇద్దరి తీసుకొచ్చి.. యువకుడిని హత్య చేసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 27 ఏళ్ల ఆడమ్ హిలరీకి, 18 ఏళ్ల హాయిలే రోజ్ బస్టోస్‌‌తో డేటింగ్ సైట్ ద్వారా పరిచయమైంది. 
 
ఆ పరిచయం కాస్త రెస్టారెంట్లో ఎంజాయ్ చేసేదాకా వచ్చింది. మరుసటి రోజూ రాత్రికి వస్తానని బస్టోస్ హిలరీ రోజ్‌కు చెప్పడంతో.. ఆమె కోసం వేయి కనులతో రోజ్ ఎదురుచూశాడు. ఆ రాత్రి వచ్చే వచ్చింది. కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తెరిచాడు. అయితే ఆడమ్‌కు రోజ్ షాకిచ్చింది. తన వెంట ముగ్గురితో వచ్చింది. ముగ్గురిలో ఒకడు హిలరీని కాల్చి చంపేయగా, ఆపై అంతా కలిసి ఆడమ్‌కు చెందిన విలువైన వస్తువులను దోచుకున్నారు. 
 
టీవీ, ఐఫోన్‌తో పాటు ఇంట్లోని ఖరీదైన సామాగ్రిని చోరీ చేసి కారులో తీసుకెళ్ళారు. కానీ రోజ్ బస్టోస్‌తోపాటు హత్య, దోపిడీలో పాల్గొన్న ముగ్గురిని యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.