బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 నవంబరు 2015 (12:31 IST)

కోరిన భంగిమలో సెక్స్ చేయలేదని మాజీ లవర్‌ను చితక్కొట్టింది... ఎక్కడ?

విపరీతమైన కామ కోర్కెలు ఉన్న మహిళలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలూ తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా ఓ మహిళ... తాను కోరిన భంగిమలో సెక్స్ చేయలేదన్న కోపంతో మాజీ ప్రియుడిని చావబాదింది. ఆ తర్వాత పదునైన కత్తితో అతనిపై దాడి చేసి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఫ్లోరిడాకు చెందిన వెండీ లూపర్‌ అనే 45 యేళ్ల మహిళ.. మైకేల్‌ వాకరో అనే వ్యక్తిని 12 యేళ్లపాటు ప్రేమించింది. ఆ తర్వాత రెండేళ్ళుగా దూరంగా ఉన్నారు. గత ఆర్నెల్ల క్రితం మళ్లీ ఒకటయ్యారు. ఈ నేపథ్యంలో.. మైకేల్‌ వాకరోతో కలిసి లూపర్ ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌కు వెళ్లింది. షాపింగ్‌ పూర్తి చేసిన అనంతరం సెల్లార్‌లోని పార్కింగ్‌ వద్దకు వచ్చిన మైకేల్‌.. కారులోనే కోర్కె తీర్చుకుందామని లూపర్‌ వద్ద ప్రతిపాదించాడు. దీనికి ఆమె కూడా సమ్మతించింది. 
 
అయితే తనకు ఇష్టమైన భంగిమలో చేద్దామని వాకరో చెప్పగా ఆ భంగిమలో వద్దని.. వేరే పొజిషన్‌లో చేద్దామని లూపర్ చెప్పింది. దానికి కోపగించుకున్న మైకేల్‌ సంభోగం చేయనని బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న లూపర్‌ కారులోని ఓ ఇనుప వస్తువుని తీసి మైకేల్‌ తలపై మోదింది. దీంతో తీవ్రంగా గాయపడిన మైకేల్‌ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు.