Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిరోడ్డుపై మ్యాట్ వేసుకుని యోగా చేయాలి..

సోమవారం, 15 మే 2017 (12:46 IST)

Widgets Magazine

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిరోడ్డుపై యోగా చేయాలా? ఇదేంటి? అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే చదవండి మరి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు జనాలు కోపంతో విసుక్కుంటారు. సహనం కోల్పోతారు. కోపంలో ఏవేవో చేస్తుంటారు. అయితే ట్రాఫిక్‌లో చిక్కుకుని విసుక్కోవడం కంటే హ్యాపీగా యోగా చేసుకోవచ్చు అంటోంది దక్షిణ ఫ్లోరిడాకు చెందిన క్రిస్టిన్. 
 
అసలు విషయం ఏమిటంటే? ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు చాలా సమయం పట్టేలా వుందని తెలుసుకున్న క్రిస్టిన్.. కారి దిగి నడిరోడ్డుపై ఎంచక్కా యోగా చేస్తూ టైమ్ పాస్ చేసింది. అంతేకాకుండా.. అలా యోగా చేస్తున్నప్పుడు తన భావాలను కూడా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. దీంతో ఆమె స్టోరీ కాస్త వైరల్‌గా మారింది. అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాకు చెందిన క్రిస్టిన్... మియామీ న్యూటైమ్స్ అనే పత్రికలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఓ రోజు ఆమె కారులో మియామీ మీదుగా వెళ్తుండగా దారిలో ట్రక్కు బోల్తా పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. 
 
గంటలు గడుస్తున్నా ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో విసుగెత్తిపోయిన క్రిస్టిన్ కారు దిగి నడిరోడ్డుపై మండుటెండలో మ్యాట్ వేసుకుని యోగా చేస్తూ కూర్చుంది. తన కారు డ్రైవర్‌తో ఫొటోలు తీయమని చెప్పింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు జనాలు ఎలా విసుక్కుంటారో.. ట్రాఫిక్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారో చెప్పడానికే ఇలా చేశానని క్రిస్టిన్ వెల్లడించింది. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబోయ్ సుజనా మా కొద్దు... ఎవరన్నారో తెలుసా..!

కేంద్రమంత్రి సుజనాచౌదరి.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత ...

news

ధర్నా చౌక్ వద్ద డిష్యూం.. డిష్యూం... పడిన రాళ్లు... పగిలిన తలలు... ఖాకీల లాఠీచార్జ్

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను కొనసాగించాలని ధర్నా చౌక్ పరిరక్షణ ...

news

సైబర్ దాడులకు అమెరికానే కారణం.. టూల్ అక్కడే తయారైంది: మైక్రోసాఫ్ట్ ఫైర్

ప్రపంచంలో తొలిసారిగా అతిపెద్ద సైబర్ అటాక్ జరిగేందుకు ప్రధాన కారణం అమెరికా సర్కారేనని ...

news

అనుమానం పెనుభూతమై... పెళ్లి కుమార్తెను వివస్త్ర చేసిన వరుడు బంధువులు... ఎక్కడ?

అనుమానం పెనుభూతమైంది. బొల్లి వ్యాధి ఉందన్న అనుమానంతో పెళ్లి కుమార్తెను వరుడు బంధువులు ...

Widgets Magazine