శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (15:07 IST)

భారతీయ బందీలకు ఇసిస్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి : సుష్మ ట్వీట్

ఇటీవల కిడ్నాప్ చేసిన నలుగురు భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు సురక్షితంగా విడుదల చేశారు. తామంతా క్షేమంగా ఉన్నట్టు వారి నుంచి విడుదలైన తర్వాత ఈ నలుగురు భారతీయులు సమాచారం చేరవేశారు. ఇదే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న నలుగురు భారతీయులను క్షేమంగా విడుదల విడిపించగలిగామని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇటీవల లిబియాలో నలుగురు భారతీయులను గుర్తు తెలియని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెల్సిందే. కిడ్నాప్‌కు గురైన వారిలో గోపీకృష్ణ (శ్రీకాకుళం), బలరాం (హైదరాబాద్‌), లక్షీకాంత్, విజయ్ కుమార్ (కర్ణాటక)లు ఉన్నారు. ఈ నలుగురిలో తొలుత ఇద్దరిని విడుద చేయగా, సోమవారం మిగిలిన ఇద్దరిని కూడా విడిచిపెట్టేశారు. తాము క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.