బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జనవరి 2017 (17:57 IST)

30 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్.. ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌.. నెటిజన్ల ఫైర్..

దేశంలో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. విదేశాల్లోనూ మహిళలకు భద్రత కరువైంది. స్వీడన్‌లో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్వీడన్ రాజధాని స్టా

దేశంలో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. విదేశాల్లోనూ మహిళలకు భద్రత కరువైంది. స్వీడన్‌లో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌లో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్టాక్ హోమ్‌లో 18, 20, 24 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని ఫేస్ బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేశారు. ఇంకా ఈ సందర్భంగా తీసిన ఫోటోలను కూడా స్నాప్ ఛాట్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. ఫేస్ బుక్‌లోని 60,000 మంది సభ్యులున్న క్లోజ్డ్ గ్రూప్‌లో ఈ వీడియో లైవ్‌లో వచ్చింది.
 
ఈ దారుణాన్ని చూసిన ఓ యువతి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీన్లోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ క్లోజ్డ్ గ్రూప్, స్నాప్ ఛాట్ సభ్యులను ఆ వీడియో స్ట్రీమింగ్, ఫోటోలు డిలీట్ చేయాలని సూచించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గ్యాంగ్ రేప్‌కు పాల్పడినవారు కిరాతకులైతే, ఆ దృశ్యాలను మౌనంగా వీక్షించిన వారు కూడా అంతేనని నెటిజన్లు ఫైర్ అవుతూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.