గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (12:18 IST)

గాజా బాలలకెందుకు స్వేచ్ఛ లేదు : ఓ బాధిత బాలుడు

ప్రపంచంలోని ఇతర బాలలలాగే తమకు కూడా స్వేచ్ఛను కల్పించాలని గాజా బాధిత బాలుడు ప్రపంచ నేతలను ప్రశ్నించారు. ఇజ్రాయెల్, హమాస్‌‍ల మధ్య జరుగుతున్న అంతర్గత పోరులో అమాయక పౌరులు నలిగిపోతున్నారు. అనేక మంది అభశుభం తెలియని చిన్నారులు దాడుల్లో మరణిస్తున్నారు. మరికొందరు బాలలు తీవ్రగాయాలతో ఆసుపత్రి పడకలపై రోదిస్తున్నారు. 
 
ఈ క్రమంలో గాజాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ అలాలియా అనే పదేళ్ళ బాలుడు ప్రపంచ నేతలను తమ దుస్థితిపై ప్రశ్నించాడు. మిగతా ప్రపంచంలోని బాలల మాదిరే తమకెందుకు స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గాజా చిన్నారులు స్వేచ్ఛాయుత భూభాగంలో లేనందుకు తనకెంతో బాధగా ఉందన్నాడు. 
 
"గాజా బాలలకెందుకు స్వేచ్ఛా హక్కు లేదు?" అని ప్రశ్నించాడు. తమకు స్వేచ్ఛ ప్రసాదించాలని తాను ప్రపంచ నేతలను కోరుతున్నానని విజ్ఞప్తి చేశాడు. కాగా, అలాలియా కాలినగాయాలు, విరిగిన చేతితో ఆసుపత్రిలో చేరాడు. అతని తల్లిని మీడియా ఇంటర్వ్యూ చేస్తుండగా, ఈ బాలుడు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. దీంతో, మీడియా ప్రతినిధి ఈ బాలుడి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది.