గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (09:43 IST)

ఐక్యూలో ఐన్‌స్టీన్ ఆ అమ్మాయి కిందే.. ఏ అమ్మాయి?

అబ్బో..! వాడెమన్న పెద్ద ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌..రా..!! అంటుంటాం. అంటే ఆయనకు మించిన మేధావులు లేరని ప్రపంచ నమ్మకం. ఇది చివరకు నానుడిగా మిగిలిపోయింది. కానీ, ఓ అమ్మాయి అందునా 12 యేళ్ళ బాలిక నిజంగానే ఐన్‌స్టీన్ ఐక్యూను మించిపోయింది. ఎవరు ఆ బాలిక? వివరాలిలా ఉన్నాయి. 
 
శక్తి నిత్యత్వ నియమాన్ని చెప్పిన ఐన్‌స్టీన్ ఐక్యూ 160. ప్రపంచంలో ఇప్పటిదాకా అంత ఐక్యూ ఉన్న వారు ఆయనతో పాటు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌, ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మాత్రమేనని ప్రపంచం అనుకునే నిజం. 
 
కానీ, వారందరినీ బ్రిటన్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక దాటిపోయింది. 162 ఐక్యూను సాధించి తెలివి గల్ల పిల్ల అనిపించుకుంది. బ్రిటన్‌లోని హార్లో ప్రాంతానికి చెందిన నికోల్‌బార్‌ అనే అమ్మాయి మెన్సా పరీక్షలో 162 ఐక్యూను పొంది మేధావి వర్గంలో చేరిపోయింది.