గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 జులై 2015 (14:40 IST)

పిల్లిని సస్పెండ్ చేసిన కామెరూన్ : మూషికాన్ని పట్టుకోకుండా నిద్రపోవడంతో..?

బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ కార్యాలయంలో ఎలుకల్ని పట్టేందుకు ఓ కింగ్ క్యాట్‌ను నియమించారు అయితే కీలక సమయంలో బాధ్యతను విస్మరించిన ల్యారీ అనే పిల్లిని ఉద్యోగం నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. కామెరూన్ తన మంత్రివర్గ సహచరులతో కీలకమైన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తుండగా.. ఆ సమయంలో ఓ ఎలుక హంగామా సృష్టించింది.
 
ఈ మూషికాన్ని పట్టుకోవాల్సిన పిల్లి ల్యారీ బంధించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పిల్లి .. ఆదమరిచి నిద్రపోతోంది. లేపడానికి ఎంతగా ప్రయత్నించినా అది ఏ మాత్రం కన్ను తెరవలేదు. దీంతో చేసేదేం లేక మంత్రులే ఎలుక వెంట పడి ఎలాగో మూషికాన్ని బంధించారు. 
 
ఈ తతంగం అంతా కామెరూన్‌కి చికాకు తెప్పించింది. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా.. మొద్దు నిద్రపోతున్న.. తన పిల్లలకు ఎంతో నచ్చిన ల్యారీని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు.