బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (12:59 IST)

భర్తను హత్య కేసులో భార్యకు ఉరి: 70 యేళ్ళ తర్వాత జార్జియాలో అమలు

అమెరికాలోని జార్జియాలో ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి ఉరిశిక్షను అమలు చేశారు. అదీకూడా ఓ మహిళకు ఈ శిక్షను అమలు చేయడం జరిగింది. తన భర్తను హత్య చేసిన కేసులో ఆమెకు ఈ శిక్షను కోర్టు విధించగా, తాజాగా అమలు చేశారు. 
 
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కెల్లీ జస్సెండనర్ అనే 47 ఏళ్ల మహిళ తన భర్త డాగ్లస్ ను కెల్లీని 1997లో హత్య చేసింది. ఈ కేసులో ఆమెకు శిక్ష పడింది. ఈ శిక్షను తప్పించేందుకు న్యాయవాదులు పలు ప్రయత్నాలు చేసినా, పోప్ లేఖ రాసినా ఫలితం లేకపోయింది. అయితే చివరిగా కెల్లి పశ్చాత్తపడిందని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. తన కారణంగా చనిపోయిన భర్తకు క్షమాపణ కూడా చెప్పిందన్నారు. 
 
అయినప్పటికీ.. కోర్టు క్షమాభిక్షను ప్రసాదించలేదు. ఫలితంగా జార్జియాలో 70 యేళ్ల తర్వాత తొలిసారి మరణశిక్షను అమలు చేశారు. జాక్సన్ నగరంలోని డయాగ్నోస్టిక్ అండ్ క్లాసిఫికేషన్ కారాగారంలో ముద్దాయికి విషపు ఇంజక్షన్ చేసి మరణశిక్ష అమలు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు.