శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2015 (15:37 IST)

ఎయిర్‌పోర్టులోనే 15 నెలల పాటు అమ్మాకూతుళ్ళు: అంతా అక్కడే!

''ద టెర్మినల్'' చిత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఫ్రాన్స్‌లోని చార్లెస్ డె గౌలీ విమానాశ్రయంలో ఇరాన్ శరణార్థి మెహ్రాన్ కారిమి ఎనిమిదేళ్లు గడిపిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇదే స్టోరీ సైప్రస్‌లోని లార్ నాకా ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. వీసా గడువు పూర్తయినా ఇజ్రాయేల్‌లో ఉండాలనే ఉద్దంశంతో  తల్లీకూతుళ్లు.. పొద్దున్నే లేస్తారు. 
 
విమానాశ్రయంలోని బాత్ రూములను వాడుకుంటారు. ఇంకా అక్కడి రెస్టారెంట్‌లో హాయిగా భోంజేసే వారు. అంతేగాకుండా.. వైఫై సాయంతో స్మార్ట్ ఫోన్లను వాడతారు. షాపింగ్ సెంటర్లకు వెళ్తారు. ఇక రాత్రయ్యిందంటే నేలపై హాయిగా పనుకుని నిద్రపోతారు. 
 
ఇలా గత 15 నెలలుగా దేశం వీడిపోకుండా ఎయిర్ పోర్టులోనే ఉన్నారు. వీరిద్దరికీ ఇజ్రాయేల్‌లోనే ఉండి పోవాలని కోరిక. అయితే ఇంతకాలం మానవత్వంతో వదిలిపెట్టామని.. జర్మనీకి పంపితేనూ వెళ్ళనంటున్నారని.. ఇకపై వీరిని బలవంతంగా తరలిస్తామని అధికారులు చెప్తున్నారు.  మరోవైపు వీరిద్దరూ ఎలాంటి సాయం కోరలేదని జర్మన్ ఎంబసీ తేల్చి చెప్పేసింది.