శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (12:13 IST)

ప్రియురాలు వదిలేసింది.. మానసిక రోగం తిరగబడింది.. ఫ్లైట్‌ను కూల్చేశాడు!

జర్మన్‌వింగ్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 కో పైలట్ లూబిట్జ్ ఓ మానసి రోగి అని, రెండు వారాల క్రితం ప్రేయసి వదిలి వేయడంతో ఆ మానసికవ్యాధి తిరగబడటంతో ఈ విమానాన్ని ఉద్దేశ్యపూర్వకంగా కూల్చివేసినట్టు తేలింది. ఫలితంగా 142 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 
 
ఈ కో పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ గురించి బిల్డ్ అనే జర్మన్ దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో లూబిట్జ్ ఫ్లాట్‌ను పోలీసులు గాలించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఆయన మానసిక రోగానికి గురయ్యాడని నిర్ధారిస్తున్నాయి. దీంతో, లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరపున అమెరికాలోని ఆరిజోనాలో పైలట్ శిక్షణ తీసుకునే సమయంలో ఏడాదిపాటు సైకోథెరపీ చేయించుకున్నాడని అతని ఫ్లాట్‌లో దొరికిన పత్రాలు చెబుతున్నాయట.
 
అభిప్రాయభేదాలతో అతని గర్ల్ ఫ్రెండ్ కూడా రెండు వారాల క్రితమే అతనిని వదిలేసిందట. దీంతో, మరోసారి మానసిక వ్యాధి తిరగబడింది. ఈ నేపథ్యంలో, మరోసారి సైకోథెరపీ చేయించుకుంటున్నాడట. ఈ క్రమంలోనే జర్మన్ వింగ్స్ విమానం పైలట్ బాత్రూమ్‌కు వెళ్లడాన్ని ఆసరాగా తీసుకుని కాక్ పిట్ డోర్ లాక్ చేసి విమానాన్ని పర్వతాలకు ఢీకొట్టాడు.