శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (16:48 IST)

జర్మన్‌వింగ్స్ ఎయిర్‌బస్ ఏ320 కో పైలట్ అల్‌ఖైదా తీవ్రవాదా?

ఫ్రెంచ్ పర్వత ప్రాంతాల్లో కూలిపోయిన జర్మన్‌వింగ్స్ ఎయిర్‌బస్ ఏ320 కో పైలట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు చెందిన తీవ్రవాదా? అనే కోణంలో ఇపుడు దర్యాప్తు సాగుతోంది. ఎందుకంటే.. గత 2001 సెప్టెంబర్ నెల 11వ తేదీన అమెరికాలోని ప్రపంచ వాణిజ్య భవనాలపై ఓ విమానాన్ని హైజాక్ చేసి దాడి చేసిన పైలట్.. ఈ ఎయిర్‌బస్ కో పైలట్‌లు ఒకే సంస్థలో శిక్షణ పూర్తి చేశారు. పైగా.. ఎయిర్‌బస్ కో పైలట్ శిక్షణా కాలంలో కొన్ని నెలల పాటు అర్థాంతరంగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నదీ.. ఏం చేశాడన్న అంశంపై ఇపుడు ఆరా తీస్తున్నారు.
 
జర్మన్‌వింగ్స్‌కు చెందిన 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కో పైలెట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ కావాలనే కూల్చేశాడని తేలిన విషయం తెల్సిందే. అయితే, విమానం కూల్చివేత వెనుక గల కారణాలపై విచారణకు దిగిన అధికారులకు ఆసక్తికర విషయాలు కనుగొన్నారు. 2001, సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానంతో దాడి జరిపిన పైలెట్ టైస్టు శిక్షణ తీసుకున్న ఆరిజోనాలోనే ఈ కో పైలట్ లూబిడ్జ్ కూడా శిక్షణ పొందాడు. 
 
ఇది కాకతాళీయమే అయినప్పటికీ, తన శిక్షణ కాలంలో కొన్ని నెలలపాటు లూబిడ్జ్ శిక్షణకు గైర్హాజరయ్యాడన్న విషయం తెలిసింది. వాస్తవానికి శిక్షణలో పైలెట్లకు దీర్ఘకాల సెలవు ఇవ్వరు. అవసరం అయితే సిక్ లీవ్ మాత్రం ఇస్తారు. లూబిడ్జ్ ఎందుకు శిక్షణా కాలంలో గైర్హాజరు అయ్యాడన్న విషయం తెలిస్తే, విమానం ప్రమాదం మిస్టరీ వీడిపోవచ్చని లుఫ్తాన్సా విమానయాన సంస్థ ఉన్నతాధికారి కార్‌ స్టెన్ స్పార్ తెలిపారు.