Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జర్మనీ చాన్స్‌లర్‌గా ఏంజిలా మెర్కెల్‌‌కే ఛాన్సెస్...

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (10:53 IST)

Widgets Magazine
Angela Merkel

ఐరోపాలోని జర్మనీ పార్లమెంటు దిగువ సభ బుందేస్టాగ్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ తిరిగి అధికారం చేపట్టారు. మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రెటిక్ యూనియన్(సీడీయూ)కు 33.2 శాతం ఓట్లు లభించాయి. 1949 సాధారణ ఎన్నికల తరువాత ఇంత తక్కువ శాతం ఓట్లు రావడం ఇదే తొలిసారి. 
 
ఇమ్మిగ్రేషన్‌ను వ్యతిరేకించే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి 13.1 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెర్కెల్.. ప్రభుత్వం ఏర్పాటుకు మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రతిపక్ష పార్టీ సోషల్ డెమొక్రటిక్‌కు 20.8 శాతం ఓట్లు వచ్చాయి. దీనిని గమనిస్తే జర్మనీలోని సగం జనాభా ఓట్లను రెండు పార్టీలే దక్కించుకున్నాయని తెలుస్తోంది.
 
కాగా, ఆదివారం నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మెర్కెల్‌ పార్టీకి 32.5–33.5 శాతం, ఎస్‌పీడీకి 20–21 శాతం, ఏఎఫ్‌డీకి 13–13.5 శాతం ఓట్లు వచ్చాయి. 2005లో తొలిసారిగా ఏంజిలా చాన్స్‌లర్‌ పదవి చేపట్టారు. ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్‌ డెమొక్రాటిక్‌ యూనియన్ ‌(సీడీయూ) – క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో ఆధిక్యం సాధించడంతో పన్నెండేళ్లుగా ఏంజిలానే చాన్స్‌లర్‌ పదవిలో కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే 16 ఏళ్లు అధికారంలో ఉండి, హెల్ముల్‌ కోల్‌ రికార్డును మెర్కెల్‌ సమం చేస్తారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హిందువులను ఊచకోత కోసిన రోహింగ్యా ముస్లింలు...

మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ గ్రామంలో 28 ...

news

రెండేళ్ళుగా కన్నతండ్రే కాటేస్తున్నాడు...

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. తల్లి ...

news

మరో ఉత్తర కొరియాగా పాకిస్థాన్.. భారీగా అణ్వాయుధాల తయారీ?

పాకిస్థాన్‌ మరో ఉత్తర కొరియా కానుందా? అణ్వాయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందా? ...

news

అమ్మ మృతిపై నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా: దిండుగల్ శ్రీనివాసన్

దివంగత సీఎం జయలలిత మృతి పట్ల వున్న అనుమానాలను అధికం చేస్తూ అటవీశాఖ మంత్రి దిండుగల్ ...

Widgets Magazine