బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (10:38 IST)

ఆప్ఘనిస్థాన్‌ దేశాధ్యక్షుడిగా అష్రాఫ్ మనీ!: ప్రతిష్టంభనకు తెర!

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రతిష్ఠంభన ఎట్టకేలకు ముగిసింది. ఆ దేశ అధ్యక్షుడిగా మాజీ ఆర్థిక మంత్రి అష్రాఫ్‌ ఘనీ ఎనికైనట్లు ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తనపై పోటీ చేసిన అబ్దుల్లాను కొత్తగా సృష్టించిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పదవిలో నియమించేందుకు అష్రాఫ్‌ అంగీకరించారు.
 
జూన్‌ 14న జరిగిన ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఘనీ, అబ్దు ల్లా ఎవరికి వారే విజేతలుగా ప్రకటించుకున్నారు. దీంతో ఫలితాలు ఇప్పటిదాకా విడుదల కాలేదు. 
 
ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్‌ ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో కొనసాగుతోంది. త్వరలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో అష్రాఫ్‌, అబ్దుల్లాల మధ్య అధికార పంపిణీ ఒప్పందం కుదిరింది.