గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (11:28 IST)

అమెరికాలో పనిచేస్తున్న హైటెక్ విదేశీ ఉద్యోగులకు ఓ శుభవార్త!

అమెరికాలో పనిచేస్తున్న హైటెక్ విదేశీ ఉద్యోగులకు ఓ శుభవార్త!. యూఎస్‌లో హెచ్-1బీ వీసాపై సేవలందిస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా పనిచేసేందుకు మే 26 తేదీ నుంచి వర్క్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. తాజా నిర్ణయం వల్ల అమెరికాలో పనిచేసే విదేశీ హెచ్-1బీ ఉద్యోగులకు ప్రధానంగా వేల భారతీయ ఉద్యోగుల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది.
 
వర్క్ పర్మిట్లు జారీ చేయాలని యూఎస్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై పనిచేసే ఉద్యోగుల జీవిత భాగస్వాములు పనిచేయడానికి అనర్హులు. మే 26 నుంచి హెచ్-బీ వీసా కలిగివున్న ఉద్యోగుల జీవిత భాగస్వాముల నుంచి వర్క్ వీసా దరఖాస్తులను ది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) స్వీకరిస్తుంది.
 
ఐ-765 ఫారాన్ని యూఎస్‌సీఐఎస్ ఆమోదించిన తర్వాత హెచ్-4 క్యాటగిరీ కింద యూఎస్‌లో నివసించే అధారిత భాగస్వాములకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డు లభిస్తుంది. దాంతో హెచ్-1బీ ఉద్యోగులకు సంబంధించిన భర్త, లేదా భార్యకు అమెరికాలో పనిచేయడానికి చట్టబద్ధంగా అనుమతి లభిస్తుంది. 
 
ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తొలిఎడాదిలో భారీగా ఉంటుందని యూఎస్‌పీఐఎస్ భావిస్తున్నది. ఈ ఏడాది దాదాపు 179600 మంది, వచ్చే ఏడాది నుంచి 55 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.