Widgets Magazine

రాజకీయాలొద్దు. కాస్త జాగ్రత్తపడితే అమెరికాలో మనకే అధికంగా గ్రీన్ కార్డులు

హైదరాబాద్, శుక్రవారం, 4 ఆగస్టు 2017 (05:40 IST)

అననుకూలతల మధ్య కూడా అనుకూలతలు దాగి ఉండి సరిగా వినియోగించుకుంటే ఎంత మేలు కలుగుతుందో అమెరికాలో మనవారికి అనుభవపూర్వకంగా తెలియనుంది. ఇన్నాళ్లూ గ్రీన్‌కార్డుల జారీకి అనుసరించిన లాటరీ విధానానికి ట్రంప్‌ సర్కారు స్వస్తి పలకనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా ఇకపై కార్డులు జారీ చేయనున్నారు. ఇవన్నీ భారతీయులకు వరంగా మారనున్నాయి. నిజంగానే అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డు) కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు ఇది శుభవార్త! 
 
గ్రీన్‌కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ‘రైజ్‌’(రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌) బిల్లును రూపొందించారు. ప్రతిభ ప్రాతిపదికన మాత్రమే గ్రీన్ కార్డులు జారీ చేయాలనే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే వాస్తవానికి వలసల్ని తగ్గించడమే బిల్లు ఉద్దేశమైనా భారత్‌ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత విద్యావంతులు, ఐటీ ఉద్యోగులకు ఈ బిల్లు మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. బిల్లులోని ప్రతిపాదించిన అంశాల ప్రకారం చూస్తే మనవాళ్లే ముందుంటారని, దీంతో సులువుగా గ్రీన్‌కార్డులు దక్కుతాయని విశ్లేషిస్తున్నారు.
 
రైజ్‌ బిల్లు చట్టరూపం దాలిస్తే భారతీయులకు లాభమే. ప్రస్తుతం 3 నుంచి 3.5 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు హెచ్‌–1బీ వీసాపై అమెరికాలో ఉన్నారు. 2016లో మొత్తం 1,26,692 మంది భారతీయులు హెచ్‌–1బీ పొందడమో, పొడిగించుకోవడమో చేశారని అమెరికా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది అమెరికా జారీ చేసిన హెచ్‌–1బీ వీసాల్లో భారతీయులకే ఏకంగా 72 శాతం దక్కాయి. వీరిలో అత్యధికులు అమెరికాలో స్థిరపడాలనే కోరుకుంటారు. గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేస్తే రైజ్‌ విధానంలో భారతీయులకు పాయింట్లు అధికంగా వచ్చే అవకాశాలుంటాయి.
 
రైజ్ బిల్లు ప్రకారం భారతీయులకు ఎలా మేలు కలుగుతుందంటే.. 
 భారతీయుల్లో అత్యధికులు అమెరికా వర్సిటీల్లో మాస్టర్స్‌ (పీజీ) పూర్తిచేసిన వారే ఉంటారు. విద్యార్హతపరంగా వీరికి 8 పాయింట్లు లభిస్తాయి. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే నాటికి మనోళ్ల వయసు 25 ఉంటుంది. 26 నుంచి 30 ఏళ్ల కేటగిరీలో ఉంటారు కాబట్టి.. 10 పాయింట్లు లభిస్తాయి. ఆదాయపరంగానూ, ఆంగ్ల భాషలో ప్రావీణ్యంలో కూడా మనోళ్లకు మంచి మార్కులే పడతాయి. కాబట్టి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి 30 పాయింట్ల అర్హతను భారతీయుల్లో అత్యధికులు సులభంగా సాధిస్తారు.
 
 గ్రీన్‌కార్డుల్లో ప్రతి దేశానికి ఒక ఏడాదికి ఇంత శాతం మించకూడదనే నిబంధన కారణంగా ప్రస్తుతం గరిష్టంగా 2 శాతం లెక్కన 9,600 డిపెండెంట్‌ గ్రీన్‌కార్డులు, గరిష్టంగా 7 శాతం లెక్కన 9,800 ఉద్యోగస్తుల గ్రీన్‌కార్డులు ఏటా భారత్‌కు లభిస్తున్నాయి. ఈ కోటాపై పరిమితుల్లో మార్పులు, చేర్పులు చేస్తారా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ పరిమితి ఎత్తివేస్తే మాత్రం గ్రీన్‌కార్డుల్లో భారతీయులు భారీగా లబ్ధి పొందుతారు. హెచ్‌–1బీ వీసాల జోలికి ప్రస్తుతం వెళ్లలేదు. అయితే వీటి దుర్వినియోగం జరుగుతోందని ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, ఎన్నికయ్యాక పలుమార్లు చెప్పారు. ఈ వీసాలకు కనిష్ట వేతనాన్ని 1,30,000 డాలర్లకు పెంచుతూ బిల్లు కూడా పెట్టారు.
 
భవిష్యత్తులో హెచ్‌–1బీ వీసాలకు కూడా ప్రతిభ ఆధారిత విధానాన్ని తెస్తే.. ఉన్నత విద్యార్హతలు, ఆంగ్లంపై పట్టు, మంచి వేతనాలు ఉంటాయి కాబట్టి భారతీయ టెకీలకు నష్టమేమీ ఉండదు. ప్రస్తుతం అమెరికా ఏటా ఇచ్చే 65,000 హెచ్‌–1బీ వీసాల కోసం కంపెనీలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేస్తున్నాయి. తద్వారా లాటరీలో వాటికి వీసాలు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ విధానం దుర్వినియోగం అవుతోందని, బడా కంపెనీలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసి ఇతరుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్‌ వాదన. అందువల్ల హెచ్‌–1బీ వీసాల మంజూరు విధానంలోనూ మార్పులు రావొచ్చు.
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'మెరిట్' ప్రాతిపదికన కొత్త చట్టం.. భారతీయులకు మేలు చేసిన డొనాల్డ్ ట్రంప్..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులను అనుమతించే విధానంలో కాస్త వెనక్కి తగ్గారు. ...

news

''ఆంధ్రా పప్పు'' బ్రాండ్‌పై నారా లోకేష్ ఏమన్నారు..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ తప్పులు మాట్లాడటంపై ఇటీవల సోషల్ ...

news

గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్... ఏంటిది అధ్యక్షా...?

గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్ ప్రకటన గోవా అసెంబ్లీలో రచ్చరచ్చ చేసింది. ఇంతకీ విషయం ...

news

ఆహారం ఇవ్వలేదు... ఎలుగుబంటికి చిర్రెత్తుకొచ్చింది.. ఏం చేసిందో వీడియోలో చూడండి..

థాయ్‌లాండ్‌లో ఆహారం ఇవ్వకుండా చుక్కలు చూపించిన ఓ యువకుడిని ఎలుగుబంటి తీవ్రంగా ...