శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (01:05 IST)

నా అరెస్టు నీకు ఉపశమనం కాదు మోదీ.. ముందుంది ముసళ్ల పండుగ: హఫీజ్ సయీద్ హెచ్చరిక

పాకిస్తాన్ ప్రభుత్వం తనను హౌస్ అరెస్టు చేస్తే కశ్మీర్ స్వతంత్రపోరాటానికి చెక్ పెట్టవచ్చని భావిస్తే అలాంటి వాళ్లు పిచ్చివాళ్ల స్వర్గంలో విహరిస్తున్నట్లే లెక్క అని ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. ‘‘నన్ను నిర్బంధంలోకి తీసుకోవడం ద్వారా

పాకిస్తాన్ ప్రభుత్వం తనను హౌస్ అరెస్టు చేస్తే కశ్మీర్ స్వతంత్రపోరాటానికి చెక్ పెట్టవచ్చని భావిస్తే అలాంటి వాళ్లు పిచ్చివాళ్ల స్వర్గంలో విహరిస్తున్నట్లే లెక్క అని ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ హెచ్చరించాడు.  ‘‘నన్ను నిర్బంధంలోకి తీసుకోవడం ద్వారా కశ్మీర్‌లోని స్వాతంత్ర్య పోరాటానికి చెక్ పెట్టవచ్చని కొందరు భావిస్తున్నారు. అలా అనుకుంటున్నవారు పిచ్చివాళ్ల లోకంలో విహరిస్తున్నట్టే. నా అరెస్ట్‌తో కశ్మీర్‌లో మరింత కల్లోలం రేగుతుంది. ఇది భారత్‌కు కొత్త తలనొప్పి అవుతుంది’’ అని సయీద్ పేర్కొన్నాడు.
 
తనను నిర్బంధంలోకి తీసుకోవాలన్న ఆదేశాలు ఇస్లామాబాద్ నుంచి రాలేదని, వాష్టింగ్టన్ నుంచి వచ్చాయని ఆరోపించాడు. తనను అరెస్ట్ చేయడం ద్వారా కశ్మీర్ అల్లర్ల నుంచి ఉపశమనం పొందవచ్చని భారత ప్రధాని మోదీ భావిస్తున్నారని కానీ అది చాలా తప్పుడు అభిప్రాయమని హెచ్చరించారు. 2017 సంవత్సరాన్ని తాము కశ్మీరీలకు సంఘీభావంగా ప్రకటించినట్టు సయీద్ వివరించాడు.
 
అమెరికా ఒత్తిడి మేరకు హఫీజ్‌ను నిర్బంధంలోకి తీసుకుని హౌస్ అరెస్టులో ఉంచే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు పోలీసుల హఫీజ్‌‌కు అనుమతి ఇచ్చారు. దీంతో హఫీజ్ మాట్లాడుతూ తన నిర్బంధంతో కశ్మీర్‌లో తిరిగి అల్లర్లు ఊపందుకుంటాయని హెచ్చరించాడు.  

హఫీజ్‌ను నిర్బంధంలోకి తీసుకున్న పాక్ 90 రోజులపాటు హౌస్ అరెస్ట్‌లో ఉంచనున్నట్టు పేర్కొంది. నిర్బంధాన్ని మరింత పొడిగించే అవకాశం కూడా ఉన్నట్టు పాక్ తాజాగా ఈరోజు స్పష్టం చేసింది.