గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (12:06 IST)

భారతే తొలి శత్రువు: హఫీజ్ వ్యాఖ్యలపై కేంద్రం రెస్పాన్స్!

భారతే తొలి శత్రువు అంటూ జమాత్ ఉద్ దవా అధినేత, 26/11 ముంబయి దాడుల వ్యూహకర్త హఫీజ్ మహ్మద్ సయీద్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్జు ఏఏన్ఐతో మాట్లాడుతూ, "అటువంటి వ్యక్తులు చేసే అన్ని ప్రకటనలకు వెంటనే స్పందించాల్సిన అవసరంలేదు. ఎవరు బెదిరింపులు చేసినా తగిన సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది" అని పేర్కొన్నారు. 
 
ఈ రకమైన అంశాలు (హఫీజ్ సయీద్ వంటి) భారత్ ను బెదిరిస్తూనే ఉంటాయని, అలాగని ఇండియా సాధారణ దేశం కాదన్నారు. బాధ్యతాయుతమైన దేశమని, అంతే అధికారం ఉందని కిరణ్ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. కాశ్మీరీలకు మద్దతు ఇచ్చే విషయంలో తమ సంస్థ పాకిస్థాన్ సైన్యానికి సహాయం చేస్తుందని నిషేధిత జమాత్ ఉద్ దావా (జెయుడి) చీఫ్ హఫీజ్ సయీద్ అన్నాడు. లక్షలాది మంది కాశ్మీరీలు స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తున్నారని, భారత ప్రభుత్వం కాల్పులు జరిపితే తాము బలంగా తిప్పికొడుతామన్నాడు.
 
కాశ్మీర్ ప్రజలు తమ హక్కులను పొందాలని పాకిస్తాన్, ఆ దేశ ప్రభుత్వం కోరుకుటోందని, దాన్ని సాధించడానికి పాకిస్తాన్ చేసే కృషిని తాము జిహాద్‌గా భావించి మద్దతు ఇస్తామని అన్నాడు.