బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (11:53 IST)

అప్జల్ గురు, మెమన్ ఉరితీతపై ఏపీ షా సెన్సేషనల్ కామెంట్స్

పార్లమెంట్ దాడి కేసులో అప్జల్ గురు, 1993 నాటి బాంబు పేలుళ్లకు ప్రధాన కారణమైన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరితీతపై ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అఫ్జల్ గురు, యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరితీతల వెనుక రాజకీయ కారణాలున్నాయని షా సెన్సేషనల్ కామెంట్లు చేశారు. సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్‌తో షా ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మెమన్ విషయంలో జాలి చూపించేందుకు కొన్ని అవకాశాలున్నా వాటిని విస్మరించారని అభిప్రాయపడ్డారు.
 
కోర్టు న్యాయమూర్తుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన విషయాన్ని ఏపీ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అఫ్జల్ కేసులో మెర్సీ పిటిషన్‌ను దీర్ఘకాలం పాటు పెండింగులో ఉంచారని గుర్తు చేశారు. కేసు విచారణ బెంచ్ కూడా మారిందని, మెర్సీ పిటిషన్ తిరస్కరించిన తరువాత ఉరితీతకు రెండు వారాల సమయం ఉండాలని, ఆ నిబంధన పాటించలేదన్నారు. ఈ కేసులో న్యాయ నిబంధనలను పాటించలేదని స్పష్టమవుతోందని వివరించారు.