గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (14:32 IST)

క్యూబాపై వాణిజ్య ఆంక్షల్ని తొలగించాలి: హిల్లరీ క్లింటన్ విజ్ఞప్తి

క్యూబాపై అమలవుతున్న వాణిజ్య ఆంక్షలను తొలగించాలని అమెరికా చట్ట సభ్యులను డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కోరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ఆమె మియామీలో మాట్లాడుతూ క్యూబాపై వాణిజ్య ఆంక్షల్ని ఎత్తివేయాలని క్లింటన్ విజ్ఞప్తి చేశారు.
 
వారి పోటీదారైన రిపబ్లికన్ పార్టీ మాత్రం హిల్లరీ వ్యాఖ్యలను ఖండించింది. క్యూబాతో సంబంధాల పునరుద్ధరణ అనేది విఫలమైన గత విధానాలను గుర్తుకు తెస్తోందని పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వానికి అందరి కంటే హిల్లరీనే ముందంజలో ఉన్నారు. తాజా 73 శాతం అమెరికన్లలో 56శాతం రిపబ్లికన్స్‌తో క్యూబాతో సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.