గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (11:58 IST)

హిల్లరీ క్లింటన్‌కు ఒబామా కితాబు : గొప్ప అధ్యక్షురాలు కాగలరు!!

అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రిగా హిల్లరీ క్లింటన్‌కు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా కితాబిచ్చారు. హిల్లరీ క్లింటన్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు కాగలరని అభిప్రాయపడ్డారు. 2016 దేశ ఎన్నికల్లో బలీయమైన డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ ఇస్తారన్నారు. 
 
ఈ మేరకు ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు. నా తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం సాధించి, వారసురాలిగా వస్తుందని ఆసక్తిగా ఉన్నా. కాబట్టి, నేను చేయగలిగినదంతా చేస్తాను. ఎన్నికల్లో ఆమె (హిల్లరీ) పోటీలో నిలిస్తే, ఓ బలమైన అభ్యర్థిగా... అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నానని చెప్పారు. 
 
ఒబామా తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు, హిల్లరీ విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. రానున్న ఎన్నికల్లో ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నప్పటికీ... ఆమె ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.