మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (19:16 IST)

పాక్‌లోని హిందువులకు దీపావళికి నో లీవ్: ఇమ్రాన్ కామెంట్స్?

దీపావళికి అధికారికంగా మలేషియా, సింగపూర్, ఫిజి, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, మారిషస్, గయానా, ట్రినిడాడ్, టొబాగో, సురినామ్ వంటి దేశాల్లో సెలవు ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్‌లో మాత్రం దీపావళి నాడు హిందువులకు సెలవు లేదు.
 
కాగా దీపావళి పండుగను పురస్కరించుని 23న సెలవు కావాలంటూ పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందూ కమ్యూనిటీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను డిమాండ్ చేస్తోంది. పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో పాటు పండుగ సందర్భంగా తమకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాక్ హిందు కౌన్సిల్ పోషకుడు డాక్టర్ రమేశ్ కుమార్ వాంక్వానీతో బాటు, అధికార పార్టీ శాసనసభ్యుడు ఒకరు మాట్లాడుతూ, సెలవు ప్రకటించటం వలన సదరు కమ్యూనిటీకి సాయం చేసినవారవుతారన్నారు. అంతేగాక తాము పాకిస్థానీ దేశభక్తి కలవారమని, వార్షిక పండుగకు సెలవు పొందే హక్కు తమకు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. 
 
ఈ విషయాన్ని తాను జాతీయ అసెంబ్లీలో లేవనెత్తుతానని వాంక్వానీ అంటున్నారు. పాక్ లోని ఏ రాజకీయ పార్టీ కూడా మైనార్టీ కమ్యూనిటీల సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపడం లేదన్నారు. 
 
ఇదిలా ఉంటే దీపావళికి లీవివ్వని పాకిస్థాన్‌లో.. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత ఇమ్రాన్ ఖాన్ పనికిరాని కామెంట్స్ చేస్తున్నారు. దేశం నుంచి పారిపోయిన హిందువులందరూ తమ పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి పాక్‌కు వస్తారని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. 
 
ఈ మేరకు మాట్లాడుతూ, "దేశంలో దురాగతాలను ఎదుర్కొన్న హిందు కమ్యూనిటీ ప్రజలు నా పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి వస్తారు" అని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఇదే సమయంలో దేశంలో బలవంతపు మతమార్పిడిపై స్పందించిన ఇమ్రాన్... హిందువులు, కలాష్ కమ్యూనిటీలను బలవంతంగా ఇస్లాంలోకి మార్పు చేయడంపై విచారం వ్యక్తం చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్ పాకిస్థాన్‌లో ఏమాత్రం పనికిరావని రాజకీయ పండితులు అంటున్నారు.