గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (12:25 IST)

అమ్మాయిల స్విమ్ సూట్‌పై వినాయకుడి చిత్రాలు... హిందూ సంఘాలు ఫైర్

అమెరికాలో అమ్మాయిలు ధరించే స్విమ్ సూట్‌పై హిందువుల ఆరాధ్య దైవం వినాయకుని చిత్రాన్ని వేసి దుస్తులను విక్రయిస్తున్నారు. అమెరికాలో ఉన్న ఒక సంస్థ మహిళలు ఈతకు వెళ్లే సమయంలో ధరించి స్విస్ సూట్‌పై వినాయకుని బొమ్మను ముద్రించి విక్రయిస్తూ వస్తున్నారు. ఈ స్విమ్ సూట్‌ను చూసిన పలువురు భారతీయుల మహిళలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా అమెరికాలోను హిందూ సంస్థలు ఈ స్విమ్ సూట్ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 
 
ఈ విషయంగా హిందూ సంస్థకు చెందిన ప్రముఖులు బీజేపీ పార్టీ రాజకీయ నేతలు మాట్లాడుతూ.. మహిళలు ధరించే స్విమ్ సూట్‌పై, వాటర్ లాంటి దుస్తులపై వినాయకును బొమ్మను ముద్రించడం తీవ్ర ఆవేదనను కలిగిస్తుందన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఉన్న ఏ విషయాన్ని అయినా వెంటనే నిలిపివేయాల్సిందేనన్నారు. ఈ దుస్తుల విక్రయాలని వెను వెంటనే నిషేధించాలని తెలిపారు. 
 
ఇంకనూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జ్యోక్యం చేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. వినాయక చవితి ఇంకా 20 రోజులే ఉన్న ఈ తరుణంలో, ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది.