గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (16:10 IST)

ఒబామా మాస్క్‌ ధరించి.. హోటళ్లో చోరీ.. దొంగ పరార్

అమెరికాలోని మస్సాసెట్స్ ప్రాంతంలోని దేశ అధ్యక్షుడు ఒబామా మాస్క్‌ను ముఖానికి ధరించి వచ్చిన దొంగ తుపాకీని చూపి బెదిరించి చోరీ చేసిన సంఘటన కలకలం రేపింది. అక్కడి సలోం నగరంలో ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ హోటల్ ఒకటి ఉంది. అందులోకి ఒమాబా మాస్క్ ధరించిన ఒక వ్యక్తి వెళ్లాడు. తినేందుకు వచ్చాడనుకుని ప్రజలు అంతగా పట్టించుకోలేదు. 
 
అయితే కొంత సేపటికి ఆ వ్యక్తి అకస్మాత్తుగా తుపాకి చూపి బెదిరించాడు. అతన్ని చూసి దిగ్భ్రాంతి చెంది ప్రజలు అలాగే నిలుచుండిపోయారు. దీంతో ఆ దొంగ హోటల్‌లోని ఉన్న గల్లాపెట్టను దోచుకుని పరారైయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న నిఘా కెమెరాలో నమోదైయ్యాయి. 
 
సమాచారం అందుకుని పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. పోలీసుల విచారణలో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇదే విధంగా మరొకరి మాస్క్‌తో వేరొక ప్రాంతంలో కూడా చోరికి పాల్పడిన విషయం తెలిసింది. దీంతో దొంగ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 
 
ఒబామా మాస్క్ ధరించి హోటళ్లో చొరబడి చోరి చేసిన సంఘటన కలకలం రేపింది. విషయం తెలిసి ఒబామా ముక్కుమీద వేలేసుకున్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇదే విధంగా ఒక దొంగ ఒబామా మాస్క్‌తో బ్యాంకులో చోరీ చేసిన సంగతి తెలిసింది.