Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యను కత్తితో పొడిచి కలలోనే చంపేశాడట.. కానీ రక్తపు మడుగులో?

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (17:46 IST)

Widgets Magazine
murder

అమెరికాలో ఓ వ్యక్తి ట్యాబ్లెట్ వేసుకుని ఆ మత్తులోనే భార్యను హతమార్చాడు. కలలో చంపేసినట్లు అనిపించిందని.. కానీ అదే విషయం కళ్లముందు జరిగిపోయిందని నానారకాలుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు తలపట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాకు చెందిన మాథ్యూ జేమ్స్ ఫెల్ప్స్ ఉన్నట్టుండి అమెరికా ఎమెర్జీన్సీ నెంబర్ 911కి అర్థరాత్రి కాల్ చేశాడు. 
 
ఫోన్ చేసి అవతలి వారితో తన భార్యను తానే చంపేసినట్లు అనిపిస్తోందని.. వెంటనే ఇక్కడకు రాగలరా అని అడిగాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఫెల్ప్స్ భార్య లారెన్‌ రక్తపు మడుగులో వుండటాన్ని చూసి షాక్ అయ్యారు. అంతేగాకుండా ఫెల్ప్స్ మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్నాడు. దీంతో అతనే భార్యను చంపేసి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో దగ్గుతో బాధపడుతున్న అతను ముందు రోజు రాత్రి కొరిసిడిన్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయాడు. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత చూస్తే తన భార్య మరణించిందని.. పక్కనే కత్తికూడా వుందని చెప్పాడు. నిద్రలో వుండగా తన భార్యను తానే చంపినట్లు అనిపించిందని.. లేచి చూసేసరికి అది నిజమైందని తెలిపాడు. ఇలా నోటికొచ్చినట్లు వాగాడు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భూమనకు జగన్ మోహన్ రెడ్డి క్లాస్... ఎందుకు?

నంద్యాల ఉపఎన్నికల్లో ఘోర పరాజయాన్ని వైసిపి అధినేత జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ...

news

భక్తి ముసుగులో నిలువు దోపిడీ.. బొప్పాయి రూ.5 వేలు... బీన్స్ విత్తనాల ప్యాకెట్ రూ.లక్ష

ఇద్దరు సాధ్వీల రేప్ కేసులో 20 యేళ్ళ జైలుశిక్ష పడిన డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం ...

news

14 ఏళ్ల బాలికపై 40 మంది గ్యాంగ్ రేప్.. రాత్రిపూట మత్తుమందిచ్చి..?

ఆసియా దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలిక కామాంధుల చేతుల్లో ...

news

రైల్వే పార్శిల్ ఆఫీసులో యువతితో హెడ్ క్లర్క్ రాసలీలలు..

రాత్రిపూట విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్‌ క్లర్క్ ఓ యువతితో రాసక్రీడల్లో మునిగితేలాడు. మొత్తం ...

Widgets Magazine