శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (15:17 IST)

ఇంటర్నెట్ యూజర్స్ 20 శాతమే! వెనుకంజలో భారత్..!

ఆధునిక ప్రపంచంలో అంతా ఇంటర్నెట్ మయం అయిపోయింది. ఏది కావాలన్నా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో అన్ని వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ప్రపంచంలో ఇంటర్నెట్ ఉపయోగించడంలో భారత దేశం మాత్రం ఇంకా వెనకబడే ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది. 
 
భారత్‌లో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య కేవలం 20 శాతం మాత్రమేనని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 32 వర్ధమాన దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. భారత్‌లో ఇంటెర్నెట్‌ను ఉపయోగిస్తున్న 20 శాతం ప్రజల్లో 65 శాతం మంది సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగిస్తున్నారు. 
 
మరో 55 శాతం మంది ఉద్యోగాల కోసం ఇంటర్నెట్‌ను సర్చ్ చేస్తున్నారు. ఇక దేశం మొత్తం జనాభాలో కేవలం 14 శాతం మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు కలిగివున్నారు. ఇండోనేషియాలో 24 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా, భారత్‌లో 20 శాతం, బంగ్లాదేశ్‌లో 11 శాతం, పాకిస్థాన్‌లో 8 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను వాడుతున్నట్టు ఆ అధ్యయనంలో తేలింది.