గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (10:45 IST)

భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతాల్లో 14వేల మందికి భారత పౌరసత్వం!

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని దాదాపు 14వేల మంది బంగ్లాదేశీయులకు శుక్రవారం భారత పౌరసత్వం లభించనుంది. సరిహద్దుల్లో గ్రామాలకు కొత్త భారత పిన్ కోడ్ సంఖ్యలు రానున్నాయి. వీరందరి ఊళ్లలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్వహణలో రేషన్ దుకాణాలు వెలుస్తాయి. అందరికీ మిగిలిన భారతీయుల తరహా అన్ని రకాల సేవలు వీరికి దగ్గరవుతాయి.
 
ఉద్యోగాలకు పోటీ పడేందుకు యువత అర్హత పొందుతుంది. దీంతో ఈ గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అంతేగాకుండా ఎక్కడ చూసినా భారత జెండా రెపరెపలాడుతున్నాయి. 41 సంవత్సరాల నాడు భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కుదిరిన ఒప్పందానికి, ఇటీవలి ప్రధాని మోడీ బంగ్లా పర్యటన తరువాత ఆమోదముద్ర పడిన సంగతి తెలిసిందే. 
 
ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య ఉన్న 162 గ్రామాల సరిహద్దులు మారాయి. బంగ్లాదేశీయులు అధికంగా ఉన్న ప్రాంతాలు ఆ దేశంలోకి వెళ్లగా, భారతీయ మూలాలు కలిగివున్న ప్రాంతాలు ఇండియా పరిధిలోకి వచ్చాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది వరకూ ప్రజలున్నారు. వీరిలో 14 వేల మంది ఉన్న ప్రాంతాలకు నేడు పిన్ కోడ్ సంఖ్యలను అందించనున్నట్టు కూచ్ బెహర్ కలెక్టర్ ఉళగనాథన్ వెల్లడించారు.