గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (09:28 IST)

ఇస్రో సాధించిన విజయం చాలా చిన్నది.. అక్కసు వెళ్లగక్కిన చైనా ప్రభుత్వ పత్రిక

ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త ప్రపంచ స్పేస్ రికార్డును నెలకొల్పింది. అగ్రదేశాలైన అమెరికా, ఫ్రాన్స్, రష్యాలకే సాధ్యం కాదని ఈ అద్భుతాన్ని ఇస్రో సా

ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త ప్రపంచ స్పేస్ రికార్డును నెలకొల్పింది. అగ్రదేశాలైన అమెరికా, ఫ్రాన్స్, రష్యాలకే సాధ్యం కాదని ఈ అద్భుతాన్ని ఇస్రో సాధించింది. దీంతో ప్రపంచం మొత్తం ఇస్రోకు సలాం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత పత్రికలు భారత్ సాధించిన ఘనతను ప్రధాన వార్తగా ప్రచురించాయి. 
 
కానీ, చైనా మాత్రం భారత్ సాధించిన ఘనతను అంగీకరించలేకపోతోంది. దీంతో భారత్ సాధించిన ఘనతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. ఇదే అంశంపై చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంలో.. 'ఇస్రో సాధించిన విజయం చాలా చిన్నదని పేర్కొంది. 104 ఉపగ్రహాలతో రికార్డు నెలకొల్పిన భారతీయులు గొప్పగా ఫీలయ్యేందుకు కారణం దొరికిందని పేర్కొంది. 
 
ఇస్రో ప్రయోగం తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఎలా విజయం సాధించవచ్చో తెలియజేస్తుందని అభిప్రాయపడింది. స్పేస్ టెక్నాలజీ రేస్ అంటే వందల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం మాత్రమే కాదని ఆ కథనంలో పేర్కొంది. తక్కువ బడ్జెట్‌లో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తోందని పేర్కొంది.
 
కానీ.. స్పేస్‌ టెక్నాలజీలో అమెరికా, చైనా కంటే భారత్‌ వెనకే ఉందని చైనా పత్రిక ఆ కథనంలో పేర్కొంది. భారత స్పేస్‌ టెక్నాలజీ కంటే చైనా చాలా ముందుకు వెళ్తొందని పేర్కొంది. భారత రాకెట్ల ఇంజిన్‌ పెద్ద తరహా అంతరిక్ష పరిశోధనలకు సరిపోయేంత శక్తివంతమైనది కాదని వ్యాఖ్యానించింది. అంతరిక్షంలో భారత వ్యోమగాములు లేరని, అంతరిక్షంలో స్వయంగా స్పేస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని భారత్‌ ఇంకా ప్రారంభించలేదంటూ తన మనస్సులోని అక్కసును వెళ్లగక్కింది.