బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (11:18 IST)

టెర్రరిస్ట్ అగ్రనేతల ఆస్తుల్ని సీజ్ చేయండి: భద్రతా మండలిని కోరనున్న భారత్

టెర్రరిస్టులకు చెక్ పెట్టేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాద నాయకులను ఆర్థికంగా దెబ్బతీయాలని భారత్ భావిస్తోంది. అప్పుడే వారిని కట్టడి చేయగలుగుతామని అంతర్జాతీయ సమాజానికి చెప్పనుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌లో తిష్ట వేసిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీ, మరో భయంకర ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆస్తులను పాకిస్థాన్ సీజ్ చేయాలని భారత్ భద్రతా మండలిని కోరనున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
 
అంతర్జాతీయ భద్రతా మండలి వీరిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా మండలిలో సభ్యత్వం కలిగిన పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చి, వీరి ఆస్తులు సీజ్ చేసేలా చేయాలని భారత్ భావిస్తోంది. ఒకవేళ ఇప్పటికే సీజ్ చేస్తే సరే, లేని పక్షంలో తక్షణం సీజ్ చేసేలా చేయాలని భారత్ భద్రతా మండలిని కోరనుందని ఆ అధికారి చెప్పారు.