గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (15:18 IST)

ఈ-మెయిల్‌ను కనుగొన్నదెవరో ఎవరో కాదు.. మనోడే?

ఈ-మెయిల్‌ను ఎవరో విదేశీయులు కనిపెట్టలేదండోయ్. తోకలేని పిట్ట.. ఈ-మెయిల్‌ను కనుగొన్నది మన భారతీయుడే!. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్‌ను 1982 ఆగస్టు 30వ తేదీన కనుగొన్నారు. 
 
అమెరికా ప్రభుత్వం కోసం 32 ఏళ్ల క్రితం తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను అయ్యదురై రూపొందించారు. అప్పట్లో న్యూజెర్సీలోని లివింగ్టన్ హైస్కూల్లో చదువుకొంటున్న అయ్యదురై.. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ కోసం ఈ మెయిల్‌ను కనుగొనేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు. 
 
వాస్తవానికి ఆయన 1978లో కార్యాలయంలో ఇతరులతో అనుసంధానమయ్యేందుకు వీలున్న పూర్తిస్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించి, దానికి 'ఈ-మెయిల్' అని పేరుపెట్టారు. కాగా, దీనికి 1982లో కాపీరైట్ లభించింది. 
 
అప్పట్లో కాపీరైట్ అంటే ఇప్పటి పేటెంటు హక్కుతో సమానం. సాఫ్ట్ వేర్ ఆవిష్కరణలను రక్షించుకోడానికి మెయిల్ చక్కని మార్గం అయింది. దీంతో ఆయన చేసిన పరిశోధనలకు గాను 1981లో అయ్యదురైకి వెస్టింగ్ హౌస్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డు లభించింది.