Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్లైట్‌లో టీనేజ్ బాలికకు టార్చర్.. తొడలపై చేయివేసి నిమురుతూ... డాక్టర్ వెకిలి చేష్టలు

సోమవారం, 7 ఆగస్టు 2017 (17:14 IST)

Widgets Magazine
teenage girl

విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ టీనేజ్ బాలిక పట్ల భారతీయ వైద్యుడొకరు అసభ్యంగా ప్రవర్తించాడు. విమాన ప్రయాణ సమయంలో తన సీట్లో నిద్రపోతున్న టీనేజీ బాలిక తొడలపై చేయివేసి నిమురుతూ వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలికకు చిర్రెత్తుకొచ్చి విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో, వారు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాలపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత జూలై 23న వాషింగ్టన్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక సీటెల్ నుంచి యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో న్యూజెర్సీకి ప్రయాణించింది. విమానం ఎక్కిన కొద్దిసేపటికే బాలిక నిద్రపోయింది. ఆమె పక్కసీట్లో భారత్‌కు చెందిన 28 ఏళ్ల డాక్టర్ విజకుమార్ క్రిష్ణప్ప కూడా ప్రయాణిస్తున్నాడు. బాలిక నిద్రలోకి జారుకుందని భావించిన ఆ డాక్టర్ ఆమెను తాకరానిచోట తాకుతూ, మోకాళ్ళు, తొడలపై చేయి వేసి నిమురుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
అయితే, తనను ఎవరో తడుముతున్నట్లు భావించిన బాలిక... వెంటనే నిద్ర నుంచి మేల్కొంది. ఆ సమయంలో విజకుమార్ నిద్రిస్తున్నట్లు నటించాడు. కానీ ఆ వ్యక్తి మరోసారి అసభ్యంగా తనను తడమడంతో మేల్కొన్న బాలిక ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసి తన సీటును మార్పించుకుంది. విమానం నేవార్క్ లిబర్టీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే పేరేంట్స్‌కు కాల్ చేసి విషయాన్ని చెప్పింది. వారు అక్కడికి చేరుకునేలోగా విజకుమార్ వెళ్లిపోయాడని గుర్తించింది.
 
తమ కూతురు ఫిర్యాదు చేయగా నిందితుడు క్రిష్ణప్పను అరెస్ట్ చేయకుండా, అతడిపై చర్య తీసుకోకుండా వదిలేసిన యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌పై కూడా బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ, ఎయిర్‌లైన్స్ వారి సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇండియన్ డాక్టర్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Arrest Teen United Flight Groping Sleeping Indian Doctor

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్ళైనా... సమీప బంధువుతో రొమాన్స్.. భర్త అడ్డని భార్యే చంపేసింది..

వివాహేతర సంబంధంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చించింది. ఆపై ఏమీ తెలియనట్లు ...

news

కసాయి భర్త : ఉద్యోగం చేస్తోందనీ భార్య తల నరికేశాడు

పొరుగు దేశం పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. తన మాటను పెడచెవిన పెట్టి భార్య ఉద్యోగానికి ...

news

నంద్యాల బైపోల్ : వైకాపాకు షాక్... శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ తిరస్కృతి!?

నంద్యాల ఉపఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. తాజాగా చోటుచేసుకున్న ఒక పరిణామం వైకాపాను ...

news

పదో తరగతి ఫెయిలైన ఆటో డ్రైవర్‌తో కూతురి ప్రేమ-వద్దన్న తండ్రి: కేసు పెట్టడంతో ఆ నలుగురు ఆత్మహత్య

చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే.. ప్రేమే ముఖ్యమని ఆ యువతి గడప ...

Widgets Magazine