శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (01:04 IST)

కోటిన్నర పరిహారం పొందిన భారతీయ యువతి... అదుర్స్!

అమెరికా అధికారులను భారతీయ యువతి తిక్క కుదిరేలా చేసింది. అంతేగాకుండా చేసిన తప్పుకు చెంపలు వేసుకుని భారతీయ యువతికి కోటిన్నర పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 
 
ఇంతకీ అసలు సంగతేంటంటే.. అమెరికాలో భారత దౌత్యవేత్తగా వున్న వ్యక్తి కుమార్తె కృతికా బిశ్వాస్ అమెరికాలోని ఓ స్కూల్లో చదువుతోంది. ఆమె టీచర్‌కి అసభ్య మెయిల్స్ పంపిందన్న అపవాదుతో అమెరికా అధికారుడు ఆమెను స్కూలు నుంచి సస్పెండ్ చేశారు.
 
అక్కడితో ఆగకుండా ఆమెను ఒకరోజు జైల్లో కూడా పెట్టారు. చేయని తప్పుకు తనను బాధ్యురాలిని చేస్తున్నారంటూ కృతికా బిశ్వాస్ న్యూయార్క్ నగర అధికారుల మీద, విద్యాశాఖ మీద కేసు పెట్టింది.
 
దీనిపై విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కోల్టెల్ అధికారులను మందలించారు. అంతేగాకుండా 1.4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దాంతో కేసులన్నింటినీ ఉపసంహరించుకునేందుకు బిశ్వాస్ అంగీకరించారు.