శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (10:42 IST)

విమానంలో మహిళకు ముద్దు పెట్టిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష

విమానంలో తోటి ప్రయాణికురాలికి ముద్దు, ఆమెపై అత్యాచారం జరిపేందుకు ప్రయత్నించిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నెవార్క్లోని జడ్జి స్టాన్లీ చెస్లర్ శుక్రవారం తీర్పునిచ్చారు. 
 
ల్యూసియానా నివసిస్తున్న ఎన్నారై దేవేందర్ సింగ్ సెప్టెంబర్ నెలలో హ్యూస్టన్ నుంచి నెవార్క్కు యూనైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. 
 
దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆ మహిళ నిద్ర నుంచి మొల్కొన్న, విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అనంతరం విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు శుక్రవారం విచారణకు రాగా దేవేందర్ సింగ్కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు.