బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 21 మే 2015 (19:11 IST)

ముంబైలో ఆ మగాడు నా ముందు హస్తప్రయోగం చేశాడు... బ్లాగులో బ్రిటన్ మహిళ

ఆరేళ్లుగా ప్రపంచంలోని దేశాలను చుడుతున్న బ్రిటన్ మహిళ లూసి హెమింగ్స్ ఇండియాలో ఓ మగాడితో తనకు ఎదురైన అనుభవాన్ని తన బ్లాగులో వెల్లడించారు. ఇదిప్పుడు నెట్లో వైరల్ గా మారింది. అసలు విషయమేమిటో ఆమె ఇలా పేర్కొన్నారు. ' కొన్ని రోజుల క్రితం నేను భారతదేశంలోని ముంబైలో ఓ బస్సు స్టాపు వద్ద కూర్చుని ఉన్నాను. నేను కూర్చున్న చోటుకు దగ్గరగా ఓ మగాడు మెల్లిగా వచ్చాడు. దాంతో నేను అతడినే గమనిస్తున్నాను. ఇంతలో అతడు తన ప్యాంటు జిప్ తొలగించి అంగాన్ని బయటకు తీసి హస్త ప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ జుగుప్సకర ఘటనతో నేను భీతిల్లిపోయాను' అంటూ ఆమె పేర్కొన్నారు.
 
ఇలాగే ఓసారి.. అంటే 2012లో తనకు 23 ఏళ్ల వయసున్నప్పుడు కూడా భారతదేశానికి వచ్చినపుడు, రిషికేష్ సందర్శనకు వెళుతున్నప్పుడు దారి మధ్యలో పొదల చాటు నుంచి ఓ పురుషుడు నక్కినక్కి చూశాడని కూడా ఆమె పేర్కొన్నారు. ఇండియాలో ఆమె చవిచూసిన అనుభవాలను బ్లాగులో పేర్కొనడం, వాటిని భారతదేశానికి చెందినవారు కూడా చూడటంతో ఆమెకు తమ దేశంలో ఎదురైన అనుభవం పట్ల క్షమాపణలు చెపుతున్నారు. ఈ పరంపరం సాగుతూ ఉంది. 
 
ఐతే ఆ పర్యాటకురాలు వివరణ ఇస్తూ.. ఇలాంటి ఘటనలు భారతదేశంలో తప్ప ఇంతవరకూ తను ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. అలాగని ఎక్కడా జరుగవని తన ఉద్దేశం కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఇండియాలో తనకు ఎదురైన ఈ చేదు అనుభవంతోపాటు తనకు దక్కిన అతిథిమర్యాదలను కూడా ఆమె తన బ్లాగులో రాసుకున్నారు.