శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (18:37 IST)

సూట్‌కేస్‌లో డెడ్‌బాడీ.. యూకేలోని లీసెస్టర్‌లో భారత సంతతి మహిళ మృతి..

యూకేలోని లీసెస్టర్‌లో భారత సంతతకి చెందిన 46ఏళ్ల మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. కిరణ్ దౌబియా‌ అనే మహిళ మృతదేహం సూట్‌కేస్‌లో లభ్యమైంది. క్రోమర్‌ స్ట్రీట్‌లో పడి ఉన్న సూట్‌కే

యూకేలోని లీసెస్టర్‌లో భారత సంతతకి చెందిన 46ఏళ్ల మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. కిరణ్ దౌబియా‌ అనే మహిళ  మృతదేహం సూట్‌కేస్‌లో లభ్యమైంది. క్రోమర్‌ స్ట్రీట్‌లో పడి ఉన్న సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలిని కిరణ్‌ దౌబియాగా గుర్తించారు. ఆమె భర్త అశ్విన్‌ దౌబియా(50)ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడే హత్య చేశాడేమోనని అనుమానంతో కేసు నమోదు చేశారు.
 
కిరణ్‌ దౌబియా గత 17ఏళ్లుగా కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కిరణ్‌ మృతితో వారి కుటుంబం షాక్‌కు గురైంది. పోలీసులు సూట్‌కేస్‌ లభించిన వీధిలో సీసీటీవీలు పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలు, ఇతర ఆధారాల కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. కిరణ్‌ ఎలా మరణించిందో పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా తెలుసుకుని దాని ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కిరణ్ మృతి పట్ల నిజా నిజాలు తేల్చేందుకు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. కిరణ్ మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.