గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2015 (17:14 IST)

పాక్ ముస్లింలకు నాలుగో, ఐదో భార్యగా హిందూ మహిళలు!

పాకిస్థాన్‌తో చర్చలకు వస్తే భారత్ ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాలపై మాత్రం చర్చలు జరుపుతోంది. అయితే అక్కడ నివసించే హిందూ మహిళల పరిస్థితి గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పాక్, భారత్ మధ్య చర్చలు జరుగుతున్నా రాజకీయ ఎజెండా తప్ప, పాక్‌లోని హిందువుల రక్షణకు భారత్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని అక్కడున్న హిందువులు వాపోతున్నారు. భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పటి నుంచి పాక్‌లో హిందూ మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. పాక్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువుల రక్షణకు సరైన చట్టాలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని సమాచారం. 
 
పాకిస్థాన్‌లో హిందూ మహిళలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. పాకిస్థాన్‌లో హిందూ మహిళలు అత్యాచారాలు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడుల బారిన పడి, సెక్స్ బానిసలుగా బతుకీడుస్తున్నారు. ఇందుకు కారణం హిందూ వివాహ చట్టం లేకపోవడమేనని చరిత్ర కారులు అంటున్నారు. పాక్‌లో హిందూ మహిళలెవరూ తమకు వివాహం జరిగిందని నిరూపించుకోలేని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, దీంతో ఏ కారణంగానైనా భర్త మరణిస్తే, అతని ఆస్తిపాస్తుల్లో వాటాలు కూడా అక్కడి భార్యలకు దక్కడం లేదని వారు చెబుతున్నారు.
 
దీంతో అలాంటి వారంతా మతం మార్చుకుని, అక్కడి ముస్లింలకు నాలుగో భార్యగానో, ఐదో భార్యగానో లేక బానిసగానో బతుకీడ్చాల్సి వస్తోందని వెల్లడించారు. కనీసం అక్కడి హిందువులకు పాక్ ప్రభుత్వం అందజేసే 'నేషనల్ డేటా బేస్ రెగ్యులేషన్ అథారిటీ' గుర్తింపు కార్డులు పొందే వెసులుబాటు కూడా చరిత్రకారులు అంటున్నారు.