శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 మార్చి 2017 (18:04 IST)

7 మీటర్ల కొండచిలువ మనిషిని మింగేసింది..కడుపు చీల్చి చూస్తే?

అదృశ్యమైన ఓ వ్యక్తి కొండచిలువ కడుపులో నుంచి విగత జీవుడిగా బయటపడ్డాడు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అక్బర్ (25) అనే వ్యక్తి పామాయిల్‌ తోట నుంచి తిరిగి వస్తుండగా కనిపిం

అదృశ్యమైన ఓ వ్యక్తి కొండచిలువ కడుపులో నుంచి విగత జీవుడిగా బయటపడ్డాడు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అక్బర్ (25) అనే వ్యక్తి పామాయిల్‌ తోట నుంచి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయాడు. అక్బర్ కనిపించట్లేదని అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఇదిలా ఉంటే.. అక్బర్ పొలం వద్ద కాలువలో 23 అడుగుల కొండచిలువ కదలలేని స్థితిలో పడివుండటాన్ని స్థానికులు గమనించారు. అక్బర్‌ను అదే మింగేసి ఉంటుందనే అనుమానంతో దాని కడుపు చీల్చి చూడగా అందులో అక్బర్ మృతదేహం కనపడింది. ఈ పాము ఏడు మీటర్లున్నదని.. అక్బర్‌ను మింగేటప్పుడు.. అతనిని వెంటాడి.. తప్పించుకోని విధంగా అతనిని చుట్టేసి వుంటుందని.. అందుకే అతడు ప్రాణాలతో బయటపడలేకపోయాడని స్థానికులు అంటున్నారు.