గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (20:40 IST)

ఆస్ట్రేలియాలో పేలిన ఐఫోన్ 7... ధ్వంసమైన కారు లోపలి భాగాలు

ఐఫోన్స్ ఏమాత్రం సురక్షితం కాదనే విషయం మరోమారు నిరూపితమైంది. తాజాగా ఆస్ట్రేలియాలో ఐఫోన్ పేలి కారు లోపలి భాగాలు ధ్వంసమయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

ఐఫోన్స్ ఏమాత్రం సురక్షితం కాదనే విషయం మరోమారు నిరూపితమైంది. తాజాగా ఆస్ట్రేలియాలో ఐఫోన్ పేలి కారు లోపలి భాగాలు ధ్వంసమయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆస్ట్రేలియాకు చెందిన సర్ఫింగ్ ఇన్ స్ట్రక్టర్ మ్యాట్ జోన్స్ అనే వ్యక్తి ఐఫోన్7ను కొనుగోలు చేశాడు. ఈయన తన ఫోన్‌ను కారులో బట్టల కింద ఉంచి సర్ఫింగ్ పాఠాలు చెప్పేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పటికీ, కారులో నుంచి పొగలు రావడాన్ని గమనించాడు. 
 
దీంతో, విస్తుపోయిన మ్యాట్ జోన్స్‌కు కారు దగ్గరకు వెళ్లాకగానీ అసలు విషయం అర్థం కాలేదు. కారులో పెట్టిన తన ఐఫోన్ పేలిపోయి కాలుతుండటాన్ని గమనించాడు. ఈ కారణంగానే కారు లోపలి భాగాలు పగలిపోయి.. కాలిపోయినట్టు గుర్తించాడు. 
 
ఈ సంఘటనకు కారణం ఐఫోన్ పేలడమేనని మ్యాట్ జోన్స్ ఫిర్యాదు చేయడంతో ఈ ఫోన్ ఉత్పత్తి కంపెనీ ఆపిల్ స్పందించింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని సంస్థ అధికారులు పేర్కొన్నారు.