శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (19:15 IST)

ఐఎస్ఐఎస్‌ మరో ఘాతుకం.. వ్యభిచారం చేసిందని తండ్రి రాళ్లతో?

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు మరో ఘాతుకానికి పాల్పడింది. మధ్య సిరియాలోని హమా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ వ్యభిచారం చేసిందంటూ ఆమెను ఐఎస్ఐఎస్ గ్రూపు రాళ్లతో కొట్టి చంపేశారు. అంతేగాకుండా ఆ వీడియోను ఆన్ లైన్‌లో పోస్టు చేశారు.
 
ఈ వీడియో తొలి ఐదు నిమిషాల్లో సదరు మహిళ తన తండ్రితో కలిసి కనిపిస్తుంది. వారి పక్కనే ఓ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ కూడా కనిపిస్తాడు. ఆమె తన తండ్రిని క్షమించమని అడిగినా, అతడు నిరాకరించినట్టు వీడియోలో వెల్లడైంది. 
 
క్షమిస్తే ఆమె స్వర్గానికి చేరుకుంటుందని, క్షమించాలని మిలిటెంట్ చెప్పినా, ఆమె తండ్రి నిరాకరించాడు. అంతేగాకుండా, ఆ కిరాతక తండ్రే రాళ్ళను పోగు చేశాడు. ఆ రాళ్ళతోనే ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఆమెను చనిపోయేదాకా కొట్టారు.