మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2016 (11:39 IST)

ఇసిస్ దారుణ చర్య.. అమెరికా సైన్యాన్ని అడ్డుకునేందుకు సల్ఫర్ గని బ్లాస్ట్...

ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) తనకు చిన్నపాటిహాని జరిగినా.. ఎలాంటి దారుణానికైనా పాల్పడేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. తాజాగా అమెరికా సైన్యాన్ని అడ్డుకునేందుకు ఏక

ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) తనకు చిన్నపాటిహాని జరిగినా.. ఎలాంటి దారుణానికైనా పాల్పడేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. తాజాగా అమెరికా సైన్యాన్ని అడ్డుకునేందుకు ఏకంగా సల్ఫర్ గనినే పేల్చివేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఇరాక్‌లోని మోసుల్ నగరాన్ని తిరిగి హస్తగతం చేసుకునేందుకు అమెరికా సారథ్యంలోని అమెరికా, ఇరాక్ సంయుక్త దళాలు మోసుల్ నగరాన్ని చుట్టుముట్టి, ఒక్కో ఉగ్రవాదినీ మట్టుపెడుతూ ముందుకు దూసుకెళుతున్నాయి. దీంతో ఈ బలగాలను అడ్డుకునేందుకు ఇసిస్.. ఆ ప్రాంతంలో ఉన్న సల్ఫర్ గనిని పేల్చింది. దీంతో వెలువడిన విషవాయువులను పీల్చి వేలాది మంది సాధారణ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
ఈ విషయం తెలుసుకున్న భద్రతా అధికారులు.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. సైన్యంలోని ప్రతి ఒక్కరూ మాస్క్‌లను ధరించే ముందుకు సాగాలని ఆదేశించారు. మౌసుల్‌కు 25 మైళ్ల దూరంలోని ముషారఖ్ సల్ఫర్ గనిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేల్చినట్టు ఇరాకీ ఫెడరల్ పోలీసు ప్రతినిధి కల్నల్ అబ్దుల్ రహమాన్ అల్ ఖాజాలి తెలిపారు. ఉగ్రవాదుల నుంచి నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఐదు రోజుల నుంచి భీకర పోరు జరుగుతోందని ఆయన తెలిపారు.