శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (11:15 IST)

వైట్‌హౌస్‌కే వస్తాం.. ఒబామా తల తీస్తాం: ఐఎస్ఐఎస్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తీవ్రవాద హెచ్చరికలు వచ్చాయి. ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను బెదిరిస్తోంది. 
 
అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లోనే ఒబామా తల తీస్తామని హెచ్చరించింది. అమెరికాను ముస్లిం రాజ్యంగా మార్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. బందీగా పట్టుకున్న ఓ కుర్దు సైనికుడిని ప్రదర్శిస్తూ, ఓ ఐఎస్ జిహాదీ ఈ హెచ్చరిక చేశాడు. 
 
"ఇస్లాంను వ్యతిరేకించే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఒబామా... మేం అమెరికా వస్తాం. వైట్ హౌస్ లో నీ తల తెంచుతాం. అమెరికాను ముస్లిం రాజ్యంగా మార్చు" అని పేర్కొన్నాడు. అంతేగాకుండా, ఫ్రాన్స్, దాని సోదరి బెల్జియం కూడా మూల్యం చెల్లించకతప్పదని అన్నాడు. 
 
కారు బాంబులు, పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టిస్తామని, తలలు తీస్తామని హెచ్చరించాడు. అనంతరం, బందీగా ఉన్న కుర్దు సాయుధుడి పీక కోయగా, అక్కడ ఉన్న సమూహం హర్షం వ్యక్తం చేసింది.