శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 29 జూన్ 2016 (08:04 IST)

ఐసిస్ ఆత్మాహుతి దాడి.... పేల్చేసుకున్న ముగ్గురు... టర్కీలో 36 మంది మృతి

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్ పిలుపునిచ్చిన నేపధ్యంలో టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు సూసైడ్ దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 36 మంది అక్కడికక్కడే మృతి చెందగా

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్ పిలుపునిచ్చిన నేపధ్యంలో టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు సూసైడ్ దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 36 మంది అక్కడికక్కడే మృతి చెందగా 150 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెపుతున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 10 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది.
 
తొలుత ఉగ్రవాదులు విమానాశ్రయంలోకి చొరబడి గార్డులను కాల్చి చంపుతూ లోనికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రయాణికులు కూర్చున్న ప్రాంతానికి చేరుకుని ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు పేల్చేసుకున్నారు. ఈ ఆత్మాహతు దాడికి భీతావహులైన ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తలోదిక్కు పరుగులు తీశారు. కాగా ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ తమకు సంబంధం ఉన్నట్లు ప్రకటించకపోయినప్పటికీ ఐసిస్ హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.