Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికాలో ఇండియన్ టెక్కీలకు ట్రంప్ షాక్... రూ.87,00,000 జీతం వుంటేనే... లేదంటే పొండి...

మంగళవారం, 31 జనవరి 2017 (13:52 IST)

Widgets Magazine
Trump

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్1 బి వీసాలతో అమెరికాలో ఉద్యోగం చేసేవారి వార్షిక వేతనం రూ. 87,00,000 వుంటేనే అమెరికాలో వుండేట్లు చట్టం తీసుకురాబోతున్నారు. ఈ బిల్లు దాదాపు ఆమోదం పొందే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే అక్కడ నివాసముంటున్న ఎన్నారైలకు పెద్ద దెబ్బే. అంతా ఇండియాకు తిరుగు ప్రయాణం కట్టాల్సి వుంటుంది. 
 
అమెరికాలో ఉద్యోగం, జీవితం అనేది వార్షిక వేతనం దాదాపు కోటి రూపాయల దాకా వున్నవారికే సాధ్యం. కాబట్టి అమెరికాలో అంత భారీ మొత్తంలో జీతాలు ఇస్తే దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర కంపెనీలు భారీ నష్టాలను చవిచూడక తప్పదు. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులకు శరాఘాతంగా మారుతుంది. 
 
మరోవైపు ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించగానే భార‌త ఐటీ దిగ్గ‌జ కంపెనీలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మ‌హీంద్రా షేర్లు 9 శాతం మేర నష్టాలు చవిచూశాయి. ఇక మ‌ధ్య‌స్థాయి ఐటీ కంపెనీల షేర్లు దారుణంగా కుప్పకూలాయి. గమనించాల్సిన విషయం ఏమంటే... బీఎస్ఈలో 4 శాతం న‌ష్టంతో ఎక్కువ న‌ష్టాన్ని మూటగట్టుకున్నది ఐటీ రంగం కావడం. మున్ముందు ట్రంప్ మరెన్ని షాకులిస్తారో వేచి చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇండియన్ టెక్కీలకు ముచ్చెమటలు... అమెరికా సభకు హెచ్1 బీ వీసాల సంస్కరణ బిల్లు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేస్తున్నారు. తన ...

news

జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న నాగబాబు.. తమ్ముడికి తోడుగా..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మెగా బ్రదర్ నాగబాబు చేతులు కలుపనున్నట్లు వార్తలు ...

news

టెక్సాస్ మహిళ కౌగిలింతల వ్యాపారం.. నో సెక్స్.. అయినా భలే డిమాండ్

అమెరికాకు చెందిన ఓ మహిళ సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ వ్యాపారం పేరు కౌగిలింతలు. ...

news

కొత్తగా పెళ్లైంది.. భర్తతో విభేదాలు.. వేరొకరితో సహజీవనం.. అనుమానస్పద మృతి.. ఎలా?

కొత్తగా పెళ్లైంది. రెండు నెలలు కూడా గడవలేదు. భర్తతో కలిసి 15 రోజులే కాపురం చేసింది. అయితే ...

Widgets Magazine